జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్
నెలవారీ ఇవిఎం గోడౌన్ తనిఖీ చేపట్టిన జిల్లా కలెక్టర్
ఖమ్మం ప్రతినిధి జనవరి 16 (ప్రజాబలం) ఖమ్మం ఇవిఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘాతో భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. గురువారం కలెక్టర్, కలెక్టరేట్ ఆవరణలోని ఇవిఎం గోడౌన్ నెలవారీ తనిఖీ చేశారు ఇవిఎం గోడౌన్ సీళ్లను కలెక్టర్ పరిశీలించారు. అగ్నిమాపక పరికరాలు, సిసి కెమెరాలను పరిశీలించి పనిచేస్తున్నవి, లేనిది అడిగి తెలుసుకున్నారు భద్రతా సిబ్బంది షిఫ్టు ల వారి విధుల గురించి అడిగి తెలుసుకున్నారు. భద్రతా లోపాలు లేకుండా చూడాలన్నారు కలెక్టర్ తనిఖీ సందర్భంగా కలెక్టరేట్ ఎన్నికల సూపరింటెండెంట్ సిహెచ్. స్వామి, ఎన్నికల డిటి అన్సారీ, అధికారులు తదితరులు ఉన్నారు.