తిరుమల హిల్స్ ఎగుడు దిగుడు రహదారులతో ఇక్కట్లు

రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 6 ఫిబ్రవరి 2025
మణికొండ మునిసిపాలిటీ పరిధిలోని పుపాలగూడ తిరుమల హిల్స్ రోడ్డు నంబర్ 12 కూడలిలో తీవ్ర రూపంలో ఉన్న దిగుడు కారణముగా స్థానిక ప్రజల కారులు దెబ్బ తింటున్నవని, అట్లాగే బయోత్ కాలనీ కూడలిలో ఎగుడు దిగుడుగా ఉన్న రోడ్డు వలన రాక పోకల వాహనాలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని, స్థానికంగా ఉన్న గోల్డెన్ టెంపుల్ వద్ద రహదారి మరమ్మత్తులు చేయనందు వలన, జలమండలి వారు త్రవ్విన తవ్వకాలను సరిచేయనందు వలన మందిరానికి వచ్చే భక్తులు పడే భాదలు వర్ణణాతీతమని, ఇట్టి ఇబ్బందికర పరిస్థితిలో ఉన్న రోడ్డుల వలన వాహన దారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని స్థానిక ప్రజల పిర్యాదు మేరకు భారత రాష్ట్ర సమితి నాయకులు కార్యకర్తలు తిరుమల హిల్స్ ప్రాంతంలో పాదయాత్ర చేయడం జరిగినది, ఇట్టి ప్రజాభిప్రాయ సేకరణలో సేకరించిన సమాచారం మేరకు సదరు మునిసిపల్ అధికారులు, జలమండలి అధికారులు స్పందించి ప్రజల బాగోగులు కోరుతూ వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, కార్యక్రమంలో చంద్రకాంత్ గౌడ్, బుద్దోల్ బాబు, మాల్యాద్రి నాయుడు, ఉపేంద్రనాథ్ రెడ్డి, అందె లక్ష్మణ్ రావు, సంఘం శ్రీకాంత్, మొహమ్మద్ అక్రమ్, షేక్ ఆరిఫ్, ఆరిఫ్ మొహమ్మద్, శ్రీనివాస్ చారి, సురేందర్ రాజు, భాషా, శ్రీధర్, చంద్రశేఖర్, సుమనళిని, భాను చందర్ తది తరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking