హైదరాబాద్:
విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పేరుతో క్షత్రియ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని
క్షత్రియ సేవా సమితి(తెలంగాణ, ఆంద్రప్రదేశ్) అధ్యక్షుడు పి. నాగరాజు రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో యన మాట్లాడారు. సమితి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అల్లూరి సీతారామరాజు పేరుతో క్షత్రియ భవన్ నిర్మాణానికి స్థలాన్ని కేటాయించాలని,అన్ని కులాలకు ఏర్పాటు చేస్తున్నట్లు గానే క్షత్రియ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని సీఎంను కోరామని తెలిపారు.రాజకీయంగా వెనుకబడిన తమకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో,నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించాలని అన్నారు.ఈ నెల 18న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డికి అభినందన సభ ఏర్పాటు చేశామని తెలిపారు.ఏపీ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, కర్ణాటక రాష్ట్ర చిన్ననీటి పారుదల శాఖ మంత్రి ఎన్. బోసు రాజు, పారిశ్రామికవేత్త అల్లూరి సీతారామరాజు,తదితరులు పాల్గొంటారన్నారు.ఈ సమావేశంలో
సమితి ఉపాధ్యక్షులు డాక్టర్ రఘురామ రాజు,వి.వెంకటేశ్వర్ రాజు, కోశాధికారి పి.వెంకటేశ్వర్ రాజు,సమితి నాయకులు భూపతిరాజు రాజేంద్ర రాజు,
జగపతి రాజు,కలిదిండి రామకృష్ణ రాజు,మూర్తిరాజు,తదితరులు పాల్గొన్నారు.