ప్రజాబలం చెన్నూరు నియోజకవర్గ రిపోర్టర్ మార్చి 10 :
మందమర్రి ఏరియా ఏఐటీయూసీ ఆఫీస్ శుక్రవారం రోజు జరిగిన ట్రేడ్ యూనియన్ సమావేశం జరిగింది. సింగరేణి యాజమాన్యం సి అండ్ ఎండి బలరాంతో గుర్తింపు కార్మిక సంఘం నాయకుల మధ్య నిర్వహించిన స్ట్రక్చర్ కమిటీ సమావేశంలో ట్రేడ్ మేన్స్ కి కుడా సూపర్వైజర్స్ లాగా షుటబుల్ జాబ్ ఇచ్చుటకు అంగీకరించారని దీనికి కృషి చేసిన సిపిఐ కొత్తగూడెం శాసనసభ్యులు ఏఐటీయూసీ గౌరవ అధ్యక్షులు కూనంనేని సాంబశివరావుకి ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్యకి ప్రధాన కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్ కి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఏఐటీయూసీ నాయకులకు మందమర్రి ఏరియా ట్రేడ్స్ మేన్స్ తరపున ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్స్ మెన్ నాయకులు టేకుమట్ల తిరుపతి, ఎన్. రాజ్ కుమార్, భాస్కర్, కె. వేణు, జి. రాజశేఖర్, ఎం.డి ముస్తాఫ్ అలీ, జగన్మోహన్ ఎస్. శ్రీనివాస్, లెక్కల రాజేష్, రాజేష్ కిరణ్, అనిల్, మహేష్, అన్వేష్ లు పాల్గొన్నారు.