డిపిఎస్ నాచారం వద్ద ట్రాఫిక్ పార్క్

 

ప్రజాబలం ఉప్పల్ నియోజకవర్గ ప్రతినిధి జనవరి 20: డిపిఎస్ నాచారం వద్ద తెలంగాణ ప్రభుత్వంతో కలిసి ఒక విశేషమైన కార్యక్రమాన్ని చేపట్టింది ఇది విద్యార్థుల్లో ట్రాఫిక్ భద్రత మరియు బాధ్యతాయుత రోడ్డు ప్రవర్తన గురించి అవగాహన కల్పించడం లక్ష్యంగా రూపొందించిన పైలెట్ ప్రాజెక్టు.
నగరంలో మొదటిసారిగా చేపట్టిన ఏ ట్రాఫిక్ పార్క్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, డిపిఎస్ సంస్థ నిర్వాహకులు చైర్మన్ మల్కా కొమురయ్య, డైరెక్టర్ పల్లవి, సి ఓ మరియు డైరెక్టర్ యశస్వి మల్కా, డైరెక్టర్ త్రిభువన మరియు సీనియర్ ప్రిన్సిపల్, డైరెక్టర్ సునీతా రావు, సమక్షంలో ఈ కార్యక్రమం 3 గంటలకు అట్టహాసంగా ప్రారంభమైంది. డిపిఎస్ విద్యార్థులు ట్రాఫిక్ పార్క్ కార్యకలాపాలను ప్రత్యక్షంగా ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా ఎన్సిసి టీం మరియు నేషనల్ అచీవర్స్ నేతృత్వంలో గాడ్ ఆఫ్ ఆనర్ నిర్వహించారు. దీప ప్రజ్వలన తో పాటు ఓఎంజి ల్యాబ్,వర్ణ లేపన కళా గ్యాలరీ, రికార్డింగ్ స్టేషన్ మరియు ఆడిటోరియం సందర్శన జరిగింది
గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మాట్లాడుతూ రోడ్డు భద్రతపై వారి ఆలోచనలు పంచుకున్నారు. ఇది కేవలం భద్రత కాదు రోడ్ బాధ్యత అని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోడ్డు మీద బాధ్యతగా ప్రవర్తించాలి, ఇలాంటి అవగాహన కార్యక్రమాలు స్కూళ్లలో చేపట్టడం చాలా ముఖ్యమని, ఒక జీవితాన్ని రక్షించగలిగితే అది స్ఫూర్తిదాయకమని చెప్పారు. డిపిఎస్ నాచారం పాఠశాల ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి పని చేస్తున్నదని ఆయన ప్రశంసించారు. జై జవాన్ జై కిసాన్ నినాదాలతో పాటుగా ‘జై విజ్ఞాన్ జై అనుసంధాన్’ లను కూడా కలుపుకోవాలని ఆకాంక్షించారు.

రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ట్రాఫిక్ పార్క్ అవసరం మరియు బాధ్యతను మరింత స్పష్టం చేసి, విద్యార్థులు తమ కుటుంబాలు ఈ అవగాహనను విస్తరించడానికి ప్రయత్నించాలని కోరారు.

సీనియర్ ప్రిన్సిపల్ మరియు డైరెక్టర్ సునీతారావు ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ, పాఠశాల గత 20 సంవత్సరాల్లో చేసిన ప్రగతిని తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ మల్కా కొమురయ్య పల్లవి మరియు డిపిఎస్ స్కూల్స్ యొక్క విద్య ప్రయాణం గురించి, అలాగే విద్యార్థులు, పర్యావరణం మరియు సమాజం కోసం భవిష్యత్తు అభివృద్ధి ప్రణాళికలను పంచుకున్నారు.

ఈ కార్యక్రమం డిపిఎస్ మరియు పిజిఓఎస్ బ్రాంచ్ల కోసం రీసెర్చ్ అండ్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అధికారిక ప్రారంభంగా కూడా నిలిచింది. ఈ విభాగం విద్య ఉత్తమతను ప్రోత్సహించడంలో సహాయపడగలదని, అందరికీ నిరంతర అభివృద్ధి జరగాలని సంకల్పించింది.

ప్రతి సంవత్సరం డీపీఎస్ విద్యార్థులు తమ దాతృత్వాన్ని చాటే “జాయ్ ఆఫ్ గివింగ్” అనే వార్షిక డిపిఎస్ సాంప్రదాయంలో భాగంగా ఫస్ట్ ఎయిడ్ కిడ్స్, రియుజబుల్ వాటర్ బాటిల్స్, టవల్స్, నాప్కిన్స్, స్టేషనరీ సరఫరాలు, ముడి ఆహారం స్టీల్ పాత్రలు, శీతాకాల దుస్తులు మరియు శానిటరీ ఉత్పత్తులను విరాళంగా 15 కు పైగా ఎన్జీవోలకు అందజేశారు.

విశిష్ట అతిధి వికాస్ రాజ్ ఈ సందర్భంగా తమ విలువైన సందేశం ద్వారా సానుభూతి, అప్రతిపత్తి మరియు మానవత్వం ప్రాముఖ్యతను వివరించారు.

ప్రతి ఒక్కరి మనసులో కృతజ్ఞతను ఉత్తమమైన ప్రకాశవంతమైన మరియు భద్రమైన రాబోయే కాలం కోసం ఆశలను నింపే జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసింది.

Leave A Reply

Your email address will not be published.

Breaking