ప్రజాబలం వరంగల్ ప్రతినిధి ఫిబ్రవరి 27
పద్మశాలి సంఘానికి ఎన్నో సేవలు అందిస్తూ చిన్న వయసులోనే అకాల మరణం చెందిన పద్మశాలి సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు అంకం వెంకటేశ్వర్లు లేని లోటు పద్మశాలీలకు తీరనిదని పద్మశాలి సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు ఆడెపు రవీందర్ అన్నారు. ఈనెల ఫిబ్రవరి 23న అకాల మరణం చెందిన పద్మశాలి సంఘం రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు అంకం వెంకటేశ్వర్లు సంతాప సభ కార్యక్రమాన్ని పోచమ్మ మైదానం చౌరస్తాలోమంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సంతాప సభకు హాజరైన పద్మశాలి సంఘం నాయకులు వెంకటేశ్వర్లు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆడెపు రవీందర్ మాట్లాడుతూ అంకం వెంకటేశ్వర్ల మరణం పూడ్చుకోలేనిదని వ్యాపారంలో రాణిస్తూనే పద్మశాలి సమాజానికి ఎన్నో సేవలు అందిస్తూ పద్మశాలీ సమాజ ఉన్నతికి ఎంతో కృషి చేశాడని, చిన్న వయసులో మరణించడం బాధాకరమని ఆయన మరణం పూడ్చుకోలేనిదని అన్నారు. అంకం వెంకటేశ్వర్లు పద్మశాలి సమాజానికి చేసిన సేవలను ఈ సందర్భంగా కొనియాడారు. ఈ సంతాప సభలో పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్నాల నరేందర్,పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వడ్నాల నరేందర్, హన్మకొండ జిల్లా అధ్యక్షులు బచ్చు ఆనందం, వరంగల్ జిల్లా గౌరవ అధ్యక్షులు కుసుమ సతీష్, వరంగల్ సిటీ అధ్యక్షులు డిఎస్ మూర్తి, ప్రొఫెసర్ వంగరి సూర్యనారాయణ, గుండు కామేశ్వర్, మాటేటి అశోక్, సామల శ్రీధర్, వైద్యం రాజగోపాల్ , మార్గం ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.