ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలన పాస్టర్లు
ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజ బలం బ్యూరో మార్చి:24 :
ట్రినిటీ ఇవాంజెలికల్ చర్చ్, చిన్నరాంచెర్ల వారు ఒక రోజు దేవుని వాక్య సదస్సును నిర్వహించారు. బచ్చన్నపేటలోని శ్రీనిధి ఫంక్షన్ హాల్ లో జరిగినటువంటి ఈ సభలకు పాస్టర్ ఎం.అరుణ్ కుమార్, పాస్టర్ ఎం.సందీప్ కుమార్, పాస్టర్ డి. మోజెస్ గార్లు, హాజరై క్రీస్తు బోధనలను వివరించారు బైబిల్లో ఉన్నటువంటి దేవుని ఉద్దేశం గూర్చి, మానవ పుట్టుకల గురించి, దేవుని యొక్క జ్ఞానాన్ని గురించి బోధించారు. ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని క్రీస్తు బోధనలను ప్రబోధించారు. క్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరు అనుసరించ దగినవని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చిన్నరాంచెర్ల బిఆర్ఎస్ నాయకులు ఎండీ.అజాం, సిపిఎం నాయకులు జి.బాపురెడ్డి, మీడియా ప్రతినిధి కర్రోల్ల నవజీవన్, పాస్టర్లు లాజర్, దానియేలు, డేవిడ్, సంఘ పెద్దలు లాజర్, విల్సన్, నర్సింహులు, సువర్ణమ్మ, విమలమ్మ, రూతమ్మ, కరుణ , తదితరులు పాల్గొన్నారు.