లక్షెట్టిపేట మాజీ జెడ్పిటిసి ముత్తే సత్తయ్య బీజేపీ పార్టీ లో ఆహ్వానించిన కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి నవంబర్ 01 : లక్షెట్టిపేట మాజీ జడ్పిటిసి ముత్తె సత్తయ్య శుక్రవారం రోజున భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎరవల్లి రఘునాథ్ ఆద్వర్యంలో కేంద్ర హోంమంత్రి శాఖ సహాయ మంత్రి మంత్రి బండి సంజయ్ తన స్వగృహంలో పార్టీ కండువ కప్పి సాదారంగా తమ పార్టీలోకి ఆహ్వానించాడు. నియోజక వర్గంలోని నాయకులు ప్రజలు విసుగెత్తి పోయి బిజెపిలో చేరుతున్నారని తెలిపారు. బిజెపిలో చేరే వారికి తగిన గౌరవం దక్కుతుందని చెప్పారు.లక్షెట్టిపేట మాజీ జెడ్పిటిసి ముత్తె సత్తయ్య మాట్లాడుతూ…బిజెపి చేస్తున్న అభివృద్ది పనులకు ఆసక్తుడనై పార్టీలో చేరనన్నారు జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ తో కలిసి నియోజక వర్గంలోనావంతు సేవలను అందిస్థానని తెలిపారు. తదనంతరం కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి మంత్రి బండి సంజయ్ మంచిర్యాల జిల్లా గురించి మాట్లాడుతూ…ఈ పది నెలల్లో మంచిర్యాల నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకుల నియంత పోకడలతో నియోజక వర్గంలోని బిజెపి నాయకులపై జనంపై ఎన్నడూలేని విదంగా అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నారని ఈ అక్రమ కేసుల వివరాలు ప్రతి ఒక్కటి నా వద్ద ఉన్నాయని చట్ట పరంగా ఎలా ఎదుర్కోవాలో అలా ఎదుర్కొంటామని కాంగ్రెస్ నాయకులకు తొత్తులై ఇకమీదట పోలీసులు అతి ఉత్సాహంతో అక్రమ కేసులు నమోదు చేసినట్లయితే మంచిర్యాల అంబేద్కర్ చౌరాస్తా లో హోమ్ శాఖ సహాయక మంత్రి హోదాలో ధర్నా చేస్తానని పోలీసులను హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గాదె శ్రీనివాస్,కొండా నరేష్, తదితరులు పాల్గొన్నారు.