“భారత వాహిణి” మొబైల్ యాప్ ను ఆవిష్కరించిన కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రి వర్యులు, మరియు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు శ్రీ. బండి సంజయ్ 

 

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ….

ఆధునిక సమాజంలోని యువతీ యువకులకు సనాతన ధర్మంలోని ఎన్నో సూక్ష్మ విషయాలను వివరాత్మకంగా అందించటానికి ప్రారంభించిన ఈ “భారత వాహిణి మొబైల్ యాప్” హిందూ బంధువులందరికీ సనాతన ధర్మాన్ని గురించి తెలుసుకోవటానికి

మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని అన్నారు.

ఈ సందర్భంగా… భారతి సేవా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్. శివ సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ… సనాతన హిందూ సంప్రదాయంలో భాగమై ఈ ఆధునిక సమాజానికి తెలియని, 50 మందికి పైగా…  భారతీయ ఋషి శాస్త్రవేత్తల చరిత్రలతో పాటు,

భగవద్గీత 18 అధ్యాయాలు, వాల్మీకి రామాయణం – 07 కాండలు, మహా భారతం – 18 పర్వాలు మరియు అష్టాదశ పురాణాలు, హిందూ దేవీ దేవతల MP3 స్తోత్రాలు

ఈ “భారత వాహిణి” మొబైల్ యాప్” లో అందుబాటులో ఉన్నట్లుగా తెలిపారు.

అలాగే, యాభైకి పైగా, యోగాసనాల వివరణ మరియు ప్రాక్టీస్ వీడియోలు,

అలాగే, అనేక వ్యాధుల నివారణకు ఉపయోగపడే ఆయుర్వేద చిట్కాలు ఈ

“భారత వాహిణి మొబైల్ యాప్” లో పొందుపరచినట్లుగా తెలియచేసారు.

తెలుగు, ఇంగ్లీష్, హిందీ, కన్నడ మరియు తమిళ భాషలలో ఈ “భారత వాహిణి

మొబైల్ యాప్” ను ఉపయోగించవచ్చని, ఈ భారత వాహిని మొబైల్ యాప్ ను

గూగుల్ ప్లే స్టోర్ నుండి ఇన్ – స్టాల్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking