విజయ డైరీ పాల సేకరణ ధర పెంచినందున అందుకు సంబంధించి రూపొందించిన పోస్టర్లను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 12 (ప్రజాబలం) ఖమ్మం ఐడిఓసి లోని కలెక్టర్ చాంబర్ లో విజయ డైరీ పాల సేకరణ ధర పెంచినందున అందుకు సంబంధించి రూపొందించిన పోస్టర్లను జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ ఆవిష్కరించారు. క్షేత్రస్థాయిలో ఉత్పత్తి వ్యయం పెరుగుతున్న నేపథ్యంలో పాడి రైతుల విజ్ఞప్తి మేరకు గేదె పాలు లీటరు ధర రూ. 73 నుంచి 80 రూపాయలు, ఆవు పాల ధర రూ. 37.20 నుంచి 42 రూపాయలకు పెంచబడినట్లు ఆయన అన్నారు. పాడి రైతులకు ఇది శుభవార్త అని ప్రభుత్వ డెయిరీ కి పాలు పోసి ఆర్థికాభివృద్ధి చెందాలని కలెక్టర్ తెలిపారు.

ఈ సందర్భంగా విజయా డెయిరీ జిఎం ఇ. మల్లయ్య, డిడి డా. కుమారస్వామి, ఎస్సిడిఆర్ మనోజ్ కుమార్, క్వాలిటీ కంట్రోల్ హెచ్ఓడి రాజ్ కుమార్, మేనేజర్ సిద్దేశ్వర్, జూనియర్ మేనేజర్ అశోక్ కుమార్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking