ఘనపూర్ లో ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం.

వేలంపాటలో లడ్డు దక్కించుకున్న బద్దం కిరణ్ కుమార్ పటేల్

తూప్రాన్, సెప్టెంబర్,ప్రాజబలం న్యూస్ :-

మెదక్ జిల్ల ఘనపూర్ పట్టణంలో జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ సరస్వతి కాలనీ వద్ద ఏర్పాటుచేసిన గణపతి నిమర్జనం లో యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుణ్ణి సాయంత్రం నిమజ్జనోత్సవ శోభాయాత్ర ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ముందుగా వినాయకుని వద్ద బద్దం కిరణ్ కుమార్ పటేల్ ప్రత్యేక పూజలు నిర్వహించారు . అనంతరం 14 రోజుల పాటు వినాయక పూజలు అందుకున్న లడ్డూ వేలం పాటలో 23100 వేల ఒక వంద రూపాయలకు పాట పాడి లడ్డూ ప్రసాదం దక్కించుకున్నారు. అనంతరం మహిళా భక్తులు కోలాటం దాండియా నృత్యాలు చేస్తూ అలరించారు. ఈ కార్యక్రమంలో బద్దం మహేష్,వినాయకకమిటీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking