తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర విశ్వబ్రాహ్మణులదే

 

చెన్నూరు నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టులను విశ్వబ్రాహ్మణులకే కేటాయించాలి

కోటపల్లి మండలం స్వర్ణకార సంఘం అధ్యక్షులు ఉట్నూరి భద్రయ్య చారి డిమాండ్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 28 : మంచిర్యాల జిల్లాలోని కోటపెల్లి,వెలుగు,తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర వహించిన విశ్వబ్రాహ్మణులకు చెన్నూరు నియోజకవర్గంలో నామినేట్ పోస్టులలో పదవులు ఇవ్వాలని కోటపల్లి మండలం స్వర్ణకార సంఘం అధ్యక్షులు ఉట్నూరి భద్రయ్య చారి కోరారు.స్వర్ణకార సంఘం అధ్యక్షతన ఏర్పడిన మీటింగ్ లో తను మాట్లాడుతూ…తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి, తెలంగాణ పితామహులు ప్రొఫెసర్ జయశంకర్ వంటి మేధావులు తెలంగాణ కోసం అశువులు బారిన ఘనత విశ్వ బ్రాహ్మణులకు దక్కిందని అన్నారు.అంతేకాదు తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించింది. తెలంగాణ శకటాన్ని రూపొందించింది కూడా విశ్వబ్రాహ్మణులే ఇలా చెప్పుకుంటూ పోతే తెలంగాణ ఉద్యమంలో ఎనలేని కృషి ఎనలేని పోరాటంలో ముందడుగులో ఉన్నది విశ్వబ్రాహ్మణులు మాత్రమే అని అన్నారు.కానీ తెలంగాణ వచ్చాక విశ్వబ్రాహ్మణ కులానికి ఎలాంటి ప్రాధాన్యత లేకుండా పోయిందని.మా విశ్వబ్రాహ్మణ కులానికి చిన్నచూపు జరిగిందని వారు ఆరోపించారు.కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఆలోచించి విశ్వబ్రాహ్మణుల కులాన్ని చిన్నచూపు చూడకుండా విశ్వబ్రాహ్మణులకు చెన్నూరు నియోజకవర్గంలో అవకాశము ఉన్న నామినేట్ పదవులను కల్పిస్తూ న్యాయం చేకూర్చాలని కోటపల్లి మండల అధ్యక్షుడు ఉట్నూరి భద్రయ్య చారి డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking