మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన వోడితల ప్రణవ్.

హుజురాబాద్ ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 6

బోర్లపల్లి లో జరిగిన పెద్దమ్మ జాతరకు వెళ్లి తిరుగు ప్రయాణం అవుతున్న తరుణంలో మొరం టిప్పర్ లారీ ఆగి ఉన్న ద్విచక్ర వాహనంపై బోల్తా పడటంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు.ఒకే కుటుంబానికి చెందిన అన్నా చెల్లెలు గంట విజయ్, గంట వర్ష తో పాటు సింధుజలు మృతి చెందారు. బోర్నపల్లి ముదిరాజ్ బోనాల జాతరకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరగడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ వోడితల ప్రణవ్ ఆ కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. హుజురాబాద్ లో ఉన్న స్థానిక కాంగ్రెస్ నాయకులను మృతుల కుటుంబ సభ్యుల వద్దకు పంపించారు.ప్రమాదం జరిగిన సంఘటన పై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking