నిధులు విడుదల చేస్తానని హామీ ఇచ్చిన వాటర్‌ వర్క్స్‌ ఎండి దానకిషోర్‌

ఎమ్‌ ఆనంద్‌ కుమార్‌ గౌడ్‌
గోషామహల్‌ ప్రజాబలం ప్రతినిధి:వాటర్‌ వర్క్స్‌ ఎండి దానకిషోర్‌ ని గోషామహల్‌ బిఆర్‌ఎస్‌ నాయకుడు ఎమ్‌ ఆనంద్‌ కుమార్‌ గౌడ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. గోషామహల్‌ నియోజకవర్గంలో ఏంజె మార్కెట్‌ ,హిందూస్థాన్‌ గల్లీ , నవరంగ్‌ హోటల్‌ , పుత్లి భౌలి , ట్రూప్‌ బజార్‌ తదితర ప్రాంతాలలో గత 18 నెలలుగా సివారేజ్‌ లైన్‌ విపరీతంగా పొంగిపొర్లుతుందని … ఈ విషయంపై జిఎమ్‌ , డిజిఎం , మేనేజర్‌ ల దృష్టికి తీసుకెళ్లానని అయిన సమస్య పరిష్కారం కావడం లేదని తెలిపారు. ఇటీవల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ దృష్టికి తీసుకెళ్తే… ఆయన సిజిఎం కి ఎండోస్‌ చేసి లెటర్‌ పంపించారని తెలిపారు. ఈ విషయంలో తమరు స్పందిస్తే పనులు వేగవంతంగా పూర్తవుతాయని ఎండీ గారిని కోరారు. సానుకూలంగా స్పందించిన ఎండి పనులకు సంబంధించి తాను నిధులు విడుదల చేస్తానని హామీనిచ్చారు. ఎండి కి ఆనంద్‌ కుమార్‌ గౌడ్‌ ధన్యవాదాలు తెలిపారు. నిమజ్జనం పుర్టైన తరువాత పనులు పూర్తి అయ్యేలా చేస్తానని ప్రజలకు ఆనంద్‌ కుమార్‌ గౌడ్‌ హామీనిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking