వీ ఆర్ ఫర్ యు ట్రాఫిక్ వాలింటర్స్ సూచన

గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ గతంలో ఉన్న గ్రామాలన్నీ మునిసిపాలిటిలుగా పరివర్తనం చెంది దిన దినాబి వృద్ది చెందుతున్న ప్రాంతాలలో అతి కీలకమైన ప్రాంతంగా మణికొండ ప్రాంతం వ్యాప్తి చెందు తున్నదనేది జగమెరిగిన సత్యం, పర్యవసానంగా ఉదయ సాయంకాలాలే కాకుండా ఎప్పుడు రద్దీగా ఉండే వాహనాల రాకపోకలను పద్ధతిగా నియంత్రించడంలో నిమగ్నమై ఉన్న ట్రాఫిక్ పోలీస్ రాములుకు తమ వంతు సహాయ సహకారాలను అందజేస్తున్న వీ ఆర్ ఫర్ యు ట్రాఫిక్ వాలింటర్స్ సభ్యులు దిలీప్ కక్కడ్, అందె లక్ష్మణ్ రావు, ప్రదీప్ రావు, బాపూజీ తదితరులు.
వాహన దారుల సమస్య తీవ్రతను గమనించి పరిష్కార దిశగా ప్రాథమికంగా షేక్పెట్ నుండి పైప్ లైన్ రోడ్ ద్వారా వచ్చే వాహనాలను పందేన్వాగు లోయర్ బ్రిడ్జ్ దాటి జెం మారుతి షో రూమ్ వద్ద బస్ మరియు భారీ వాహనాలను నేరుగా పంపిస్తూ కార్లు చిన్న వాహనాలన్నింటిని పైప్ లైన్ క్రిందుగా ప్రక్కకు తరలించి వన్ వే విదానం పాటిస్తు పురాతన నివాసిత ప్రాంతమ్ లో ఉన్న జిల్లా పరిషత్ హై స్కూల్ కూడలి వరకు వన్ వేగా ముందకు సాగిస్తు మరియు మఱ్ఱి చెట్టు నుండీ వచ్చే అన్ని వాహనాలను కూడలి నుండి నేరుగా స్కూల్ వైపు పోకుండా, కుడివైపుకు తిరుగ నీయకుండ – ఫ్రీ లెఫ్ట్ గా తరలిస్తే కొంతలో కొంత మేర వాహన దారులకు, ప్రజలకు అతి సౌకర్య వంతంగా ఉంటుందని వీ ఆర్ ఫర్ యు ట్రాఫిక్ వాలింటర్స్ సభ్యుడు అందె లక్ష్మణ్ రావు తమ అభిప్రాయాన్ని వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking