మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
ప్రజాబలం- మెదక్ జిల్లా ప్రతినిధి 2 సెప్టెంబర్ 2024:
భారీ వర్షాలకు జిల్లాలో వరద నష్టాన్ని అంచనావేసి ప్రభుత్వానికి నివేదిక ఎప్పటికప్పుడు అందజేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు
సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో
భారీ వర్షాల కారణంగా జిల్లాలో ఆస్తి నష్టం ప్రాణనష్టం, పంట నష్టం, శాఖల వారీగా జిల్లా కలెక్టర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అకాల వర్షాల వలన వరద నష్టాన్ని అంచనా వేస్తున్నామని వివరించారు.
జిల్లాలో ఇప్పటివరకు 165 ఎకరాల పంట నష్టం వాటిల్లిందని వ్యవసాయ అధికారి ద్వారా అంచనా వేశామని, పంచాయతీరాజ్ 09 రోడ్లు ,ఆర్ అండ్ బి-11 రోడ్లు దెబ్బతిన్నాయని నివేదికలు అందజేశారని చెప్పారు. ఇరిగేషన్ శాఖ ద్వారా ఒక చెరువు, ఒక కెనాల్ బ్రి చ్ అయినట్లు తెలియజేశారని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలు (07) పాక్షికంగా దెబ్బతిన్నాయని విద్యాశాఖ అంచనా వేశారని చెప్పారు. పాపన్నపేట మండలం కొంపెల్లి గ్రామంలో ఒక పశు మృతి చెందిందని జిల్లాలో 223 ఇండ్లు పాక్షికంగ దెబ్బతిన్నట్లు అంచనా వేశామని చెప్పారు. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని వివరించారు.
ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అధికారులు అందరూ క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని , ఆర్డబ్ల్యూఎస్ విభాగం ద్వారా సురక్షితమైన త్రాగునీరు సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మండల అభివృద్ధి అధికారులు పంచాయతీ సెక్రటరీలు హెడ్ క్వార్టర్ మెయింటైన్ చేయాలని సంబంధిత జడ్పీ సీఈవో, డిపిఓ ను ఆదేశించారు.
వ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి
వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తంగా వ్యవహరించాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవిన్యూ వెంకటేశ్వర్లు, జెడ్పి సీఈవో ఎల్లయ్య జిల్లా పంచాయతీ అధికారి యాదయ్య, జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్, జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ బి శ్రీరామ్ ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్ ఆర్ అండ్ బి అధికారులు తదితరులు పాల్గొన్నారు