మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి
స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఏడిజెఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ తిగల శ్రీనివాస్ రావు
ప్రజాబలం మంచిర్యాల నియోజకవర్గం రిపోర్టర్
డిసెంబర్ 13 : హైదరాబాద్ లోని జిల్ పల్లిలో
విధినిర్వహణ లో భాగంగా వార్త సేకరణకు వెళ్లిన జర్నలిస్ట్ లపై దుర్భాశలాడుతూ,విశాక్షణ రహితంగా భౌతిక దాడి చేసి టివి9 ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రంజిత్ పై జైగోమాటిక్ బోన్ ఫ్రాక్చర్ అయ్యే విదంగా లోగో తో దాడి చేసిన మంచు మోహన్ బాబుపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని ఆల్ డెమోక్రాటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ప్రజా సమస్యలను ఎప్పటి కప్పుడు ప్రభుత్వాన్ని చేరవేస్తూ ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పని చేస్తున్న జర్నలిస్ట్ లపై దాడులు అధికమౌతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.జర్నలిస్ట్ లపైన దాడులను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.ప్రభుత్వం జర్నలిస్ట్ లపై దాడులు జరుగకుండా కఠిన చట్టాలను అమలు చేయాలని కోరారు.
సమాజానికి నిజాయితీతో సమాచారాన్ని అందించేందుకు కృషి చేసే జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరు ఖండించవలసిన అవసరం ఉందని అల్ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తీగల శ్రీనివాస్ రావు అన్నారు.ఇటీవలి కాలంలో ప్రముఖ నటుడు మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేయడం అత్యంత దౌర్జన్యమైన చర్యగా మేము భావిస్తున్నాం అని అన్నారు.ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా నాల్గవ స్థంభంగా ఉంది.జర్నలిస్టులు తమ విధులను నిర్వహించే సమయంలో ఎదురయ్యే ఇబ్బందులను, ముప్పులను తట్టుకుని,ప్రజలకు వాస్తవాలను వెల్లడించడానికి ప్రయత్నిస్తారు. ఇటువంటి సందర్భంలో వారిపై దాడులు జరగడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు అని అన్నారు. మోహన్ బాబు వంటి ప్రముఖులు తమ స్థాయిని ఉపయోగించి సమాజానికి స్ఫూర్తిదాయకంగా నిలవాలి గాని, ఇలాంటి దాడుల ద్వారా ద్వేషాన్ని ప్రేరేపించటం సరికాదన్నారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరిపి మోహన్ బాబు తో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి శ్రీనివాస్ రావు ప్రభుత్వాన్ని కోరారు.ఏ జర్నలిస్ట్ కి కష్టం వచ్చినా ఏ డి జె ఎఫ్ అండగా నిలుస్తుందన్నారు ఇలాంటి దాడుల పునరావృతాన్ని నివారించేందుకు, జర్నలిస్టుల రక్షణకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని తీగల శ్రీనివాస్ రావు కోరారు.