ప్రజలకు సమాధానం చెబితేనే మంత్రి హరీష్ రావును అడుగు పెట్టనిస్తాం,పట్టణ అధ్యక్షుడు వీరమళ్ళ హారి గోపాల్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 14 : ప్రజలకు సమాధానం చెబితేనే మంత్రి హరీష్ రావు ను లక్షెట్టిపేటలో రేపు అడుగు పెట్టనిస్తామని బీజేపీ పట్టణాధ్యక్షుడు వీరమళ్ళ హరిగోపాల్ హెచ్చరించారు. మంగళవారం మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేటలోని పట్టణంలోని ఐబీ విశ్రాంత భవన్ లో విలేకరుల సమావేశంలో బీజేపీ నాయకులు మాట్లాడారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…లక్షెట్టిపేటలో డబుల్ బెడ్ రూమ్ లు ఎక్కడ అని ప్రశ్నించారు.తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ల పేరుతో ప్రజలను మోసం చేసిందని మండిపడ్డారు.వర్షాలతో మునిగిపోయిన ఇండ్లకు,పంటలకు ఆర్ధిక సహాయం అందించకుండా హరీష్ రావు లక్షెట్టిపేట కు రావడం సిగ్గు చేటన్నారు.కేవలం 6 ఎకరాల ప్రభుత్వ భూమిని అధికార పార్టీ నాయకులు,అధికారులు సేకరించకపోవడంతో 100 పడకల ఆసుపత్రి అనేది 30 పడకలకు మారింది అనేది నిజం కాదా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా గూడెం లిఫ్ట్ లో ఏం ఎస్ పైపులు ఎందుకు వేయడం లేదని ఇందుకు మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.ఈ సమావేశం లో బీజేపీ నాయకులు వేముల మధు,బొప్పు సతీష్, గుండా ప్రభాకర్,శివ శంకర్, మోటపలుకుల సతీష్,బి.రవి గౌడ్ శతదితరులు పాల్గొన్నారు.