వంశీ కృష్ణ ను భారీ మెజారిటీతో గెలిపించండి
ప్రచారంలో జోరుపెంచిన కాంగ్రెస్ నాయకులు
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 26 : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామని,పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీ కృష్ణ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కాంగ్రెస్ నాయకుడు ఎం డీ అమీర్ ఖాన్ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని పలువార్డుల్లో అయన స్థానిక నాయకులతో కలిసి ఇంటింటా ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ను భారీ మెజారిటీతో గెలిపించాలని,కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేసి తీరుతామని పట్టణంలో ఇంటింటికి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరిస్తూ,చేతి గుర్తుకు ఓటేయ్యాలని ప్రచారం చెయ్యాలని కార్యకర్తలను ఆదేశించారు.అనంతరం ఓటు ఎలా వేయాలో ప్రజలకు,ఓటర్లకు అవగాహన కల్పించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీగా గడ్డం వంశీ కృష్ణ ను గెలిపించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని,చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా గడ్డం వంశీ కృష్ణ ను గెలిపించాలని ఓటర్లను కోరారు.ఈ కార్యక్రమంలో నాయకులు నయీమ్,అంజూమ్,జమీర్, మస్రత రఫీక్, వీఖర్,సాదిక్, నజీర్,షాకీర్ తదితరులు పాల్గొన్నారు.