కార్యకర్తలే పార్టీ కి ఆయువు పట్టు..
కార్యకర్తలను గౌరవించుకుందాం..
ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళండి…
నాయకులు ప్రజలతో మమేకమవ్వండి…
స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటండి…
ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షి నటరాజన్..
గాంధీ భవన్ లో మెదక్ పార్లమెంట్ సమీక్ష సమావేశం..
మంత్రులు, ఉమ్మడి మెదక్ జిల్లా ముఖ్యనేతలతో కలిసి
పాల్గొన్న నీలం మధు ముదిరాజ్..
మెదక్ జిల్లా ప్రజాబలం ప్రతినిధి :-
కార్యకర్తలే పార్టీ కి ఆయువు పట్టని, కార్యకర్తల శ్రమతోనే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ అన్నారు.
మంగళవారం గాంధీ భవన్ లో టిపిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొని కాంగ్రెస్ నాయకులకు శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రటరీ విష్ణునాథ్ మంత్రులు దామోదర్ రాజ నరసింహ,కొండ సురేఖ, మెదక్ నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, రాష్ట్ర నాయకులు గాలి అనిల్ కుమార్, ఆంజనేయులు గౌడ్, మరియు ఉమ్మడి మెదక్ జిల్లా నియోజకవర్గ ఇన్చార్జిలు గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ రాజిరెడ్డి, దుబ్బాక నియోజకవర్గం ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి , ముఖ్య నేతలతో కలిసి మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ కార్యకర్తల కష్టంతోనే అధికారంలోకి వచ్చామన్న విషయాన్ని నాయకులు గుర్తుంచుకోవాలన్నారు. ప్రతి నాయకుడు కార్యకర్తకు అండగా నిలబడుతూ సంపూర్ణ సహకారం అందించాలని సూచించారు. తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను అభివృద్ధి కార్యక్రమాలను విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు తీసుకోవాలన్నారు.నాయకులు హైదరాబాద్ నుంచి కదిలి క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ పని చేయాలని ఆదేశించారు. ప్రజలకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.నాయకులంతా విబేధాలు పక్కన పెట్టి కలిసికట్టుగా పని చేసి స్థానిక ఎన్నికలలో సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
అనంతరం నీలం మధు మాట్లాడుతూ మెదక్ పార్లమెంట్ సమీక్ష సమావేశంలో పార్టీ పెద్దలు సూచననలకనుగుణంగా ముందు కు వెళ్తామన్నారు. కార్యకర్తలను గౌరవిస్తూ వారి ప్రతి కష్టసుఖాల్లో అండగా నిలబడి కడుపులో పెట్టి చూసుకుంటానని భరోసా ఇచ్చారు. ఇప్పటికప్పుడు ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు చరవేస్తూ ప్రణాళిక బద్ధంగా పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్నామని స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సహకారంతో మెదక్ పార్లమెంట్ పరిధిలో సత్తా చాటుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య నాయకులు నియోజకవర్గ ఇంచార్జిలు, డీసీసీ ప్రెసిడెంట్లు,ఆఫీస్ బేరర్లు, కాంగ్రెస్ సేవాదళ్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.