“ఎస్ ఎల్ బి సి సొరంగం గ్రావిటీ కాలువలో నల్లగొండకు జరిగిన అన్యాయం ఏమిటి?” మరియు “దశ దిశ లేని డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు.” అనే అంశాలపై రౌండ్ టేబుల్ కార్యక్రమం
“ఎస్ ఎల్ బి సి సొరంగం గ్రావిటీ కాలువలో నల్లగొండకు జరిగిన అన్యాయం ఏమిటి?” మరియు “దశ దిశ లేని డిండి ఎత్తిపోతల ప్రాజెక్టు.” అనే అంశాలపై సోమాజిగూడ ప్రెస్ క్లబ్ హైదరాబాదులో ఈరోజు తెలంగాణ సకల జనుల వేదిక- తెలంగాణ జల సాధన సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రొఫెసర్ వినాయక్ రెడ్డి అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమంలో ఆకునూరి మురళి (మాజీ కలెక్టర్ ఐఏఎస్ రిటైర్డ్) మాట్లాడుతూ కెసిఆర్ ప్రభుత్వం కమిషన్లు వచ్చే ప్రాజెక్టు మాత్రమే ముందు చేపట్టింది. ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టును ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్లలో 52 శాతం పూర్తి చేస్తే, 9 నెలలు కెసిఆర్ ప్రభుత్వం 25% కూడా పూర్తి చేయలేదు. ఎస్ ఎల్ బి సి డి, డిండి ప్రాజెక్టులను సంవత్సరంలోగా పూర్తి చేయాలని కెసిఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణ అని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను అన్ని విధాల నాశనం చేసింది అన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులలో కేసీఆర్ లాంటి వారు అన్నీ తానై చేస్తున్న రాజకీయ జోక్యంలో తెలంగాణ రాష్ట్రం అప్పుల గుట్టగా మారింది. నీటిపారుదల ప్రాజెక్టుల చేపట్టడం కొరకు అన్ని విషయాలలో ఒక ప్రత్యేకమైన “నీటిపారుదల కమిషన్ను నిజాయితీపరులైనటువంటి ఇంజనీర్లతో ఏర్పాటు చేయాలని మురళి గారు మాట్లాడారు. తొమ్మిదేళ్లు కేసీఆర్ దోపిడీ అన్ని రంగాలని నాశనం చేసింది. అపా రమైన వనరులు సంపద ఉన్నటువంటి రాష్ట్రాన్ని కెసిఆర్ కుటుంబం అన్ని విధాల దిగజార్చింది. విద్య వైద్యం అడుగంటి పోయింద న్నారు.
జస్టిస్ చంద్రకుమార్ మాట్లాదుతు ఫ్లోరైడ్ నిర్మూలనకు ఎస్ఎల్బీసీ ప్రధానమైన ప్రాజెక్టు. తెలంగాణ ఉద్యమంలో ఫ్లోరైడ్ గురించి నల్గొండ నీటి బాధల గురించి మాట్లాడిన కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఎస్ఎల్బీసీలో కమిషన్లు రావని దానికి నిధులు కేటాయించలేదన్నారు. 2000 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టును నిధులు కేటాయించక కరెంటు బిల్లుకే సుమారు 3000 కోట్లు ఖర్చుపెట్టిన దుస్థితి ఉంది. కెసిఆర్ ప్రభుత్వం అన్ని నిర్మాణాలు చేపట్టి అందులో భారీ ఎత్తున దోచుకోవడం గా మారింది. నిజాయితీతో పట్టుదలతో ఇలాంటి అవినీతి ప్రభుత్వాలను ప్రజల్లో ఎండబెట్టడానికి కృషి చేయాలి అన్నారు. నిజాయితీతో ప్రజల పక్షాన పని చేసే వారందరూ ఒక వేదిక పైకి రావాలన్నారు.
రిటైర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ విట్టల్ రావు గారు మాట్లాడుతూ ఎస్ ఎల్ బి సి ప్రాజెక్టు రూపకల్పన ఆ గ్రావిటీ ప్రాజెక్టు వల్ల ఐదు నియోజకవర్గాలకు నల్లగొండలో కలిగే ప్రయోజనాన్ని వెల్లడించారు ఫ్లోరైడ్ ఏ విధంగా అది నిర్మూలిస్తుందో చెప్పారు. ఉద్దేశపూర్వకంగా నిధులు కేటాయించకుండా ఎస్ ఎల్ బి సి పనులు నత్త నడకలో జరిగాయని విశ్లేషించారు. డిండి ప్రాజెక్టుకు దశ దిశ లేకుండా దానికి నీటి వనరు కూడా ఈనాటి వరికు నిర్ణయించకపోవడం, సర్వే చేయకపోవడంతో, ఆ ప్రాజెక్టు ప్రయోజనం చేకూర్చే నల్లగొండ జిల్లాలోని నియోజకవర్గాలు నష్టపోయాయి అన్నారు
నైనాల గోవర్ధన్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు ఎస్ఎల్బీసీ పైన ఉన్న చిత్తశుద్ధి అత్యంత సమర్థవంతమైన ప్రభుత్వమనీ చెప్పుకుంటున్న కెసిఆర్ కు లేకపోవడం నల్లగొండ జిల్లా ప్రజలకు గ్రహించాలన్నారు. లక్షన్నర కోట్ల కాలేశ్వరం , 45 వేల కోట్ల భగీరథ ప్రాజెక్టులలో వేగంగా దోచుకోవడం పైన ఉన్న శ్రద్ధ, 2000 కోట్ల తో పూర్తయ్యే దాంట్లో తగిన కమిషన్ రాదని నిధులు కేటాయించక నత్త నడకలు నడిపించారన్నారు. కొత్త ప్రాజెక్టులు భారీ దోపిడీతో తెలంగాణ అప్పుల కుప్పగా మారితే వాటి కాంట్రాక్టర్ అయిన మెగా కృష్ణారెడ్డి ప్రపంచ కుబేరుడు గా ఎదిగాడు. కెసిఆర్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అన్ని విధాల వంచించాడు మోసం చేశాడు, ఫ్లోరైడ్ నల్లగొండకు ఎనలేని ద్రోహం చేశాడు.
రిటైర్డ్ ఇంజనీరు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కృష్ణా నదిలో పూర్వం నుంచి దర్శన తెలంగాణకు ముఖ్యంగా నల్లగొండకు జరిగిన నష్టాన్ని వివరించారు. ఫ్లోరైడ్ పీడిత నల్లగొండలో ఎస్ఎల్బీసీ పూర్తి చేయకపోవడం వల్ల కెసిఆర్ అన్ని విధాల నిర్లక్ష్యం చేస్తానని చెప్పారు ఎస్ఎల్బీసీ డిండి ప్రాజెక్టులు పూర్తి చేసి ఉంటే కొన్ని వేల కోట్ల రూపాయల పంట నల్లగొండలోని అనేక నియోజకవర్గాలలో వచ్చి ఉండేదని చెప్పారు
సాధినేని వెంకటేశ్వరరావు (సిపిఎంఎల్ న్యూడిమోక్రసీ) మాట్లాడుతూ గత ప్రభుత్వం చేపట్టిన 90 శాతం పూర్తయిన 34 ప్రాజెక్టులు , కేవలం 11 వేల కోట్లతో చేపట్టి ఉంటే 32 లక్షల ఎకరాలు సాగు ఏది అన్నాడు. కెసిఆర్ ప్రభుత్వం ఫ్లోరైడ్ జిల్లా చరిత్రను అద్భుతంగా మారుస్తానని చెప్పి అధ్వానంగా చేశాడు అన్నారు.
చెరుకు సుధాకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు యుద్ధ ప్రాతిపదికను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు . ఎస్ ఎల్ బి సి సొరంగముందు అనేకసార్లు పోరాటం చేసేమన్నారు. తెలంగాణ కొరకు జైల్లోకి వెళితే కేసీఆర్ రాజులా, రాజభోగాలు తెలంగాణ ప్రజల సొమ్ముతో అనుభవిస్తున్నారు అన్నారు. తెలంగాణ ప్రాజెక్తు ల్లో అడ్డు అదుపు లేకుండా దోచుకున్నారన్నారు. తుమ్మిడి హెట్టి ని నిర్మించకుండా, కాలేశ్వరం ప్రాజెక్టు నిర్మించి తెలంగాణను కొల్లగొట్టారన్నారు.
కోటేశ్వరరావు (సిపిఎంఎల్ న్యూడిమోక్రసీ) మాట్లాడుతూ ఎస్ ఎల్ బి సి అంటే ఫ్లోరైడ్ ప్రాజెక్టు. ఫ్లోరైడ్ ప్రాజెక్టు అంటే ఎస్ ఎల్ బి సి. 15 ఏళ్లలో కూడా పూర్తి కాకపోవడం నల్లగొండ జిల్లాకు జరిగిన తీరని ద్రోహం అన్నారు. ఎస్ఎల్బీసీ కంటే వెనక చేపట్టిన శ్రీశైలం వెలుగోడు సొరంగం నిశ్శబ్దంగా జగన్ ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. 60 ఏళ్ల పోరాటంతో ఏర్పడ్డ తెలంగాణ ప్రభుత్వం ఎస్ఎల్బీసీ ని నత్తనడకలో కుట్రతో నడిపించారన్నారు.
అంబటి నాగయ్య మాట్లాడుతూ ఎస్ ఎల్ బి సి ఉద్దేశపూర్వకంగా కెసిఆర్ నత్తనడకన నడిపించారు అన్నారు. డిండి ప్రాజెక్టు కాంట్రాక్ట్ లో డబ్బులు దోచుకున్నారు. కానీ దానికి నీటి వనరు ఎక్కడి నుంచి తీసుకోవాలో ఈరోజు వరకి ఆలోచించలేదు అన్నారు .60 ఏళ్ల పోరాట తెలంగాణను 50 సంవత్సరాలు వెనక్కు తీసుకెళ్లారన్నారు.
సాంబశివరావు నీటిపారుదల విశ్లేషకులు మాట్లాడుతూ కృష్ణ ట్రిబ్యునల్ లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరిగిందన్నారు .తెలంగాణకు జరిగిన అన్యాయాలు సరిదిద్దడానికి అనేక దశాబ్దాల్లో తెలంగాణ పాలకులు చిత్తశుద్ధితో వ్యవహరించలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ ప్రయోజనాలపై పని చేయడంలో విఫలమయ్యాడు అన్నాడు. పైగా మహారాష్ట్ర నాందేడ్ కు వెళ్లి శ్రీరాంసాగర్ నీళ్లు , ఆంధ్రకు వెళ్లి తెలంగాణ నీళ్లు ఎత్తిపోసు కొండి అన్నారు.
ఈ కార్యక్రమంలో మురళి మురళీధర్ గుప్త తెలంగాణ ప్రజల పార్టీ అధ్యక్షుడు సోగ రా బేగం ,అన్వర్ ఖాన్, రిటైర్డ్ ఇంజనీర్ పాత వెంకటరమణ. తదితరులు పాల్గొన్నారు.
