ఆ ముగ్గురిలో ఎవరు బెటర్.!?

ఒకరిని మించి ఒకరిది.. టాప్ హిస్టరీ.!
కాంగ్రెస్ లో పార్లమెంట్ టికెట్ హోరు
పెద్దపల్లిలో బలంగా మాదిగ కార్డు పవర్.!!

పెద్దపల్లి ప్రజాబలం ప్రతినిధి జనవరి 9

పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి ప్రయత్నిస్తున్న ముగ్గురు మహామహులే. ఒకరు మాజీమంత్రి డాక్టర్ ఆగం చంద్రశేఖర్, మరొకరు నేతకాని హక్కుల సంఘాల జాతీయ అధ్యక్షులు, చతిస్గడ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీనివాస్ గోమాస, ఇక మూడో ఆశావాహులు డాక్టర్ వివేకానంద తనయుడు వంశీలు.. ఈ ముగ్గురే కాకుండా మరో 10 మంది కూడా పెద్దపల్లి నుండి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. ముందు వరుసలో ఉన్న ప్రధానంగా ముగ్గురి మధ్య టిక్కెట్ల పోటీ ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ ఆశిస్తున్న మాజీ మంత్రి డాక్టర్ ఆగం చంద్రశేఖర్ తెలంగాణ ఉద్యమం కోసం తన మంత్రి పదవిని త్యాగం చేసిన చరిత్రతో పాటు , గత పార్లమెంట్ పెద్దపల్లి ఎన్నికల్లో ఓడిపోయిన సానుభూతి..తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ను ఎదిరించిన తొలి దళిత నాయకుడు చంద్రశేఖర్ అలాంటి ఆయన తిరిగి పెద్దపల్లి నుండి టికెట్ కోసం తన ప్రయత్నాలు చంద్రశేఖర్ తో పాటు గోమాస శ్రీనివాస్ సైతం దేనికి తక్కువ కాదన్నట్టు.. ఒకసారి టిఆర్ఎస్ నుండి పెద్దపల్లిలో పోటీ చేసి ఓడిపోయారు. తిరిగి రెండు సార్లు కాంగ్రెస్ నుండి టికెట్ కోసం ప్రయత్నించిన సమయంలో ఒకసారి డాక్టర్ వివేక్ ,రెండవసారి చంద్రశేఖర్ టికెట్లు దక్కించుకున్నారు. ఇలా మూడుసార్లు తృటిలో రాజకీయంగా నష్టపోతు జాతీయస్థాయి నేతలతో సాన్నిహిత్యం కలిగిన గోమాసకు కలిసి వస్తుందన్న అభిప్రాయాలు ఉన్నాయి. వివేక్ ఆరుసార్లు పార్టీ మారిన అపవాది ఉంది, ఇక చంద్రశేఖర్ కాంగ్రెస్ నుండి వెళ్లి తిరిగిబిజెపి నుండి కాంగ్రెస్లో చేరారు. గోమాస శ్రీనివాస్ మాత్రం పదేళ్లుగా కాంగ్రెస్ లోనే ఉంటున్నారు.బిజెపి నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన డాక్టర్ వివేక్ తన తనయుడు టికెట్ ఇంతకుముందే ఒప్పందం జరిగినట్టు వార్తలు వచ్చాయి. కానీ,పెద్దపల్లి లో ఇటీవల కాలంలో మాదిగ కార్డు డిమాండ్ బట్టబయలు అవుతుంది. పెద్దపల్లి పార్లమెంటు టికెట్ మాదిగల కేటాయించాలన్న వాదనలు బలపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ టికెట్ మాదిగలకు ఇచ్చే విధంగా తమ సత్తా చాటాలని వివిధ పార్టీలో ఉన్న మాదిగలంతా పార్లమెంటుపై కన్నేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైపు మాదిగలు దృష్టి సారించారు ఎస్సీ సామాజిక వర్గంలో పెద్దపల్లి పార్లమెంటులో మాదిగలది ఓటర్లపరంగా బలమైన వర్గం. కానీ రాజకీయంగా ఇప్పటివరకు మాల.. మాల ఉపకుల నేతకానికే అవకాశాలు దక్కాయి. ఈసారి మాదిగ సామాజిక వర్గం వారు పెద్దపల్లిని చేజార్చుకోరాదని పోరాటానికి సిద్ధపడుతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి తలపడి ఓటమి చెందిన డాక్టర్ చంద్రశేఖర్ మాదిగ సామాజిక వర్గానికి చెందినవారు. ఈ విషయం గమనించిన వారు 2019 పెద్దపల్లి పార్లమెంటులోని ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నాయకులు పార్టీ రహితంగా చంద్రశేఖర్ కు పెద్ద ఎత్తున మద్దతు పలికారు. గతంలో కూడా అప్పటి సిటింగ్ ఎంపీ వెంకటస్వామి పై మాదిగ సామాజిక వర్గం నాయకురాలు సుగుణ కుమారి రెండుసార్లు విజయం సాధించింది విధితమే. అప్పటి గెలుపు తర్వాత పెద్దపల్లి పార్లమెంటులో మాదిగల్లో ఐక్యత మొదలైంది. మాదిగ వర్గం తలుచుకుంటే పెద్దపల్లి పార్లమెంటును దక్కించుకోవచ్చు అన్న పట్టుదల పెరిగింది.కానీ, దానికి తగ్గట్టుగా అభ్యర్థి లభించలేదు. గత ఎన్నికల్లో చంద్రశేఖర్ వచ్చినప్పటికీ పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా బలహీనంగా ఉండడం, సమయం అనుకూలించకపోవడంతో విజయం పొందలేకపోయారు .ఈసారి మాదిగ బలం నిరూపించుకోవడానికి కొందరు చంద్రశేఖర్ను ప్రతిపాదిస్తుండగా, మరికొందరు గజ్జలకాంతం కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. పెద్దపెల్లిలో ఈనెల 5న మాదిగల ఐక్యత కోసం ఓ వేదికను ఏర్పాటు చేశారు. ఈ వేదిక మాదిగ గళాన్ని బలాన్ని నిరూపించింది. మాదిగ వాయిస్ ను జనంలో పంపించింది. పార్లమెంటులో మాదిగల బలం నిరూపించేయడానికి ఈ వేదిక కొంతమేరకు సక్సెస్ అయింది. చంద్రశేఖర్ సహా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, గజ్జలకాంతం తో పాటు కాంగ్రెస్ పార్టీ నుండి న్యాయవాది పెరిక శ్యామ్ ఇంకా సుల్తానాబాద్ మాజీ జెడ్పిటిసి భర్త ఊట్ల వరప్రసాద్, ఇలా పలువురు కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం క్యూ కట్టారు. మాదిగల ఎంపీ టికెట్ డిమాండ్ ప్రభావంతో టికెట్ ఆశిస్తున్న ఉపకులాల నాయకులు గోమాస శ్రీనివాస్, వివేక్ తనయుడు వంశీలు ఇబ్బంది పడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking