పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు టీబీ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువ.

 

పరిశ్రమలు తగిన చర్యలు తీసుకోవాలని పిలుపు.

పారిశ్రామిక కార్మికుల భద్రతలో భాగంగా టీబీ అవగాహన సదస్సులో పిలుపు.

……డి ప్రశాంత్ కుమార్
జిల్లా పారిశ్రామిక కేంద్రం జనరల్ మేనేజర్

సంగారెడ్డి జులై 16 ప్రజ బలం ప్రతినిధి :డి అశోక్.
సంగారెడ్డి పరిధిలోగల అరోమా రెస్టారెంట్లో మంగళవారం రోజు ఉదయం పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు టీబీ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పరిశ్రమలు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా పారిశ్రామిక కేంద్రం జనరల్ మేనేజర్ డి ప్రశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. ఐ యాం ఫర్ టీబీ ప్రాజెక్టులో భాగంగా టీబీ అలర్ట్ ఇండియా వారు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీబీ నిర్మూలన సామాజిక బాధ్యతగా తీసుకోవడం వలన చాలా కుటుంబాలు రక్షించిన వారవుతామనీ, జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలను అనుసరించి ప్రతి పరిశ్రమలో టీబీ కార్యక్రమాలు నిర్వహించాలనే సమాచారాన్ని అందజేశామని టీబీ నివారణ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఎన్ టి ఈ పి , టీబీ అలెర్ట్ వారికి సహకరించాలని ఆయన కోరారు . క్షయ వ్యాధి అవగాహన కార్యక్రమాలు చేస్తున్నటువంటి టీబీ అలెర్ట్ ఇండియా సంస్థను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా టీబీ నివారణ అధికారిని డాక్టర్ జి రాజేశ్వరి మాట్లాడుతూ పరిశ్రమలలో పనిచేస్తున్న వారందరూ ఒక చోట ఉండి పనిచేయడం వలన టీబీ ఒకరి నుండి ఒకరికి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పరిశ్రమలలో పనిచేస్తున్న వారికి సేవలు అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని కాబట్టి ఎన్ టి ఈ పి సేవలను వినియోగించుకోవాలని ఆమె తెలియజేశారు . టీబీ వచ్చిన వారిని పనిలో నుండి తీసివేయాల్సినా అవసరం లేదని వారికి తగిన సహకారం అందిస్తే వ్యాధి పూర్తిగా నయం అవుతుందని ఆమె తెలియజేశారు .ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ పరిశ్రమల ప్రతినిధులు తమ పరిశ్రమలలో చేపట్టిన టీబీ కార్యక్రమాల అనుభవాలను పంచుకున్నారు. అలాగే టీబీ నివారణకు తమ పరిశ్రమల నుండి పూర్తి మద్దతును ఇస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీబీఅలర్ట్ ప్రాజెక్టు సిబ్బంది పి. పరస పురుషోత్తం,పి. కృష్ణ , జె శ్రీకాంత్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించగా ఎన్ టి ఈ పి సిబ్బంది చెన్నయ్య , శ్రీనివాస్, దేవేందర్ , నర్సిరెడ్డి, అరుణ పాల్గొన్నారు

       

Leave A Reply

Your email address will not be published.

Breaking