నేతాజీ పార్క్ లో యోగా శిబిరం

మనికొండ ఆల్కాపుర్ కాలనీలోనీ నేతాజీ పార్క్ కు తెలంగాణ రాష్ట్ర తూర్పు విభాగ డిస్త్రిక్ట్ 1 గా భారతియ యోగా సంస్థాన్ ద్వారా పూర్తి స్థాయి గుర్తింపు పొందినది, ఈ సందర్భమున తెలంగాణ రాష్ట్ర తూర్పు విభాగ కార్యదర్శి ప్రొఫెసర్ సదానంద చారి, డిస్త్రిక్ట్ 1 అధ్యక్షుడు వెర్గిన్ నాయక్, కార్యదర్శి యుగెందర్, ల్యాంకో హిల్స్ సెంటర్ ఇంచార్జి దివ రామ కృష్ణ, ఎమ్ జీ పార్క్ సెంటర్ ఇంచార్జి ప్రదీప్ రావు, ఎమ్ జీ పార్క్ సెంటర్, ల్యాంకో హిల్స్ సెంటర్ల సాధకురాలు మంజూ అగర్వాల్ పాల్గొన్న సంధర్బంగా అందరి అభిప్రాయ సేకరణలో భాగంగా నేతాజీ పార్క్ సాధకుడు ప్రసాదరావు బలపరచగా ఏకాభిప్రాయంతో బీ సుగుణను నేతాజీ పార్క్ సెంటర్ ఇంచార్జి గా నియమించడం జరిగింది కావున మనికొండ నివాసులు ప్రతిరోజూ ఉదయం ఆరు గంటల నుండి ఏడు వరకు జరిగే యోగాసన ప్రక్రియలు చేసి లబ్ధి పొందాలని సూచించారు మరియు ముఖ్య విషమంగా రాబోయే మూడు రోజులు 24-02-2023 నుండి 26-02-2023 ఆరు గంటల నుండి ఏడు వరకు వాత పిత్త ఖఫలపై యోగ సాధన ద్వార అవగాహన సదస్సు తెలంగాణ రాష్ట్ర భారతీయ యోగా సంస్థాన్ ముఖ్యులు సుధీర్ కుల్కర్ని వారు ఉచిత శిబిరం నిర్వహించేదరు ఈ సదవకాశాన్ని ప్రజలందరూ సద్వినీయోగ పరచుకోని ఆరోగ్యవంతంగా ఉండాలనీ శిబిర వ్యవస్థను చూస్తున్న యోగా సెంటర్ నిర్వాహకులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking