ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు

ఎమ్మిగనూరు పట్టణంలో భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న “డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్” గారు దేశానికి అందించిన సేవలు చిరస్మరణం, సమాజంలోని అసమానతలు, సామాజిక రుగ్మతల నిర్మూలనకు కృషి చేసి అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు, “డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 64వ వర్ధంతి” సందర్భంగా మన ప్రియతమ నాయకులు, రైతు బిడ్డ, నియోజకవర్గ సీనియర్ నాయకుడు “ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి” గారి అధ్వర్యంలో పట్టణంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా వెళ్ళుతు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించినారు. ఆయన మాట్లాడుతూ దళిత జాతి ముద్దుబిడ్డ, అట్టడుగు స్థాయి నుంచి కేంద్రమంత్రిగా పదవి అధిరోహించి సమాజతీరును పరిశీలించి ప్రపంచంలోనే ఎదురులేని రాజ్యాంగాన్ని సువర్ణ అక్షరాలతో రచించి యుగాలు గడిచినా, తరాలు మారినా మరపురాని భరతమాత ముద్దుబిడ్డ బాబాసాహేబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇవే మా ఘన నివాళులు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బుట్టారంగయ్య గారు, సునీల్ కుమార్, శాంతా రాజ్, ప్రభాకర్, మైనార్టీ నాయకులు రియాజ్ ఆహ్మ ద్, కాశీం బేగ్, హజీ వాహాబ్, షబ్బీర్ ఆహ్మద్, సయ్యద్ చాంద్, మన్సూర్ బాషా, నజీర్ ఆహ్మద్, అమాన్, తిరుమల రెడ్డి, దారాల శ్రీను, సూరి, నారేష్, రాజా రెడ్డి, నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.ప్రజా నేత్ర రిపోర్టర్: ఎర్రకోట మహలింగ ప్ప..

Leave A Reply

Your email address will not be published.

Breaking