అంబేద్కర్ పేరుతో కొత్త సచివాలయం కొప్పులకు కృతజ్ఞతలు చెప్పిన మల్లారెడ్డి

 

జగిత్యాల, ఫిబ్రవరి 2: భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు ను కొత్త సచివాలయానికి పెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయములో పాత్ర పోషించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ కు ప్రజాసంఘాల జే.ఏ.సి. జగిత్యాల జిల్లా అధ్యక్షులు బోనగిరి మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ను హైదరాబాద్లో బుధవారం కలిసి మల్లారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. గురువారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వం దళితుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు. దళితబందు పతకంతో దళితులను ఆర్థికంగా శక్తివంతులను చేస్తోందన్నారు. అలాగే అంబేద్కర్ ఆలోచనలను పాటిస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నిర్మిస్తున్న సచివాలయానికి అంబేద్కర్ పేరును ప్రతిపాదించడం శుభపరిణామమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆలోచనలు ఉన్నాయని అందుకే ప్రజాసంఘాల పక్షాన కృతజ్ఞతలు చెప్పానన్నారు. అలాగే జిల్లాలోని పలు అంశాలపై మంత్రికి విన్నవించినట్లు మల్లారెడ్డి పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking