ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన ఆధ్వర్యంలో వార్త రిపోర్టర్ కి ఆర్థిక సహాయం.l

 

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 02 (ప్రజాబలం) ఖమ్మం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహాసేన ఆధ్వర్యంలో వార్త రిపోర్టర్ గా పనిచేస్తున్న పాశం వెంకటేశ్వరావు కు 25 కేజీల బియ్యము మరియు రెండు వేల రూపాయల ను ఆర్థిక సహాయం గా అందజేశారు . డిసెంబర్ 24 వ తారీకునా చిన్న ఇన్సిడెంట్ జరిగిందని తెలుసుకొని మహాసేన ఖమ్మం జిల్లా అధ్యక్షుడు మంద సంజీవరావు వారి టీం తో కలిసి పరిమర్శించి ఆర్థిక పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు . అనంతరం వారు త్వరగా కోలుకోవాలని దేవుని ప్రార్థించారు . వారి కుటుంబానికి ఎప్పుడూ అండగా ఉంటామని మహాసేన తరపున సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేయడం జరిగినది . ఈ కార్యక్రమంలో ఎస్సీ , ఎస్టీ , బీసీ , మైనార్టీ మహాసేన ఖమ్మం జిల్లా బీసీ సెల్ అధ్యక్షులు అంగడాల అనిల్ యాదవ్ , ఖమ్మం నియోజకవర్గం అధ్యక్షులు పసలపూడి రమేష్ , టౌన్ అధ్యక్షులు వడకాల ప్రవీణ్ యాదవ్ , యూత్ టౌన్ అధ్యక్షులు మారపాక పృద్వి తదితరులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking