శ్రీ శ్రీ శ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి ఉత్సవాల సభ కరపత్రం ఆవిష్కరణ

 

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 02 (ప్రజాబలం) ఖమ్మం గట్టయ్య సెంటర్ బంజారా భవనంలో ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర ఇంచార్జ్ రంజిత్ నాయక్ ఆధ్వర్యంలో శ్రీ శ్రీ శ్రీ సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి ఉత్సవాల సభ కరపత్రలను ఆవిష్కరించారు . ఫిబ్రవరి 15న సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి ఉత్సవాలను తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని లంబాడిహక్కుల పోరాట సమితి , గిరిజన విద్యార్థి సంఘం పిలుపునిచ్చింది . ఫిబ్రవరి 19వ తేదీన హైదరాబాద్ కేంద్రమైన సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాల బహిరంగ సభకు తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా వున్న లంబాడీ ప్రజలు తరలి వచ్చి విజయవంతం చేయాలన్నారు . సేవాలాల్ జయంతి ఫిబ్రవరి 15 ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని , సేవాలాల్ జయంతి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించడానికి ప్రతీ జిల్లాకు 5 కోట్ల రూపాయలు విడుదల చేయాలని , కొత్తగా నిర్మిస్తున్న సెక్రటేరియట్ లో సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని పెట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు . ఈ కార్యక్రమంలో ఎల్ హెచ్ పి యెస్ జిల్లా అధ్యక్షులు మాతృ నాయక్ , జిల్లామహిళ అధ్యక్షురాలు అనితబాయి , నూతన జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రసాద్ నాయక్ , ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రచార కార్యదర్శి అనిల్ నాయక్ , బాలు నాయక్ , కిషన్ నాయక్ , విజయ బాయి , రమేష్ నాయక్ , కౌసల్య మరియు ఇతర సభ్యులు పాల్గొన్నారు .

Leave A Reply

Your email address will not be published.

Breaking