కంటి వెలుగు శిబిరాల్లో లక్ష్యం మేరకు పరీక్షలను నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి

 

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 02 (ప్రజాబలం)ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ఆమె తణిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లను పరిశీలించారు. వైద్య సిబ్బందినిర్దేశిత సమయానికి శిభిరానికి చేరుకొని కంటి పరీక్షలు నిర్వహించిన అవసరమైన వారికి కళ్లజోళ్ళు పంపిణి చేయాలన్నారు. రోజుకు ఎంతమందికి పరీక్ష చేస్తున్నది, కళ్లజోళ్ళు ఎంత నిల్వఉన్నది, ప్రిస్కిప్షన్ కళ్ళజోళ్ళకు ఎంతమందికి ఆర్డర్ చేసినది వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆన్లైన్ నమోదులు జాగ్రత్తగా చేపట్టాలని ఆమె సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking