తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియమాకాల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో శనివారం నాడు చేపట్టిన చలో ప్రగతి భవన్ కార్యక్రమాన్ని నిలువరించేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని మేడ్చల్ జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు అసర్ల బీరప్ప అన్నారు సమస్యకు పరిష్కారం చూపేందుకు సిధ్ధంగా లేని ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నాలు చేయడం సిగ్గు మాలిన చర్యగా అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన పోలీసు నియమాకాల్లో అవలంబిస్తున్న నూతన విధానాల వలన అనేకమంది అర్హులైన వారికి నష్టం జరగడంతో పాటు కొంత మంది ప్రాణాలు కోల్పోయారని అందుకే నియమాకాల్లో జరుగుతున్న అవకతవకలపై విచారణ జరిపేలా చర్యలు తీసుకోవాలని కోరితే పోలీసులు ముందస్తు అరెస్టులకు పాల్పడ్లడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. పోలీసులు అరెస్టు చేసిన యూత్ కాంగ్రెస్ నాయకులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.