మేడ్చల్ జిల్లా ప్రజాబలం ప్రతినిధి:మేడ్చల్ జిల్లా మైనార్టీ మోర్చా ఇంచార్జ్ అమీనా ఈరోజు కూకట్‌పల్ల్లి నియోజకవర్గం 114 డివిజన్లోకి వారు విచ్చేసి మైనార్టీల భాగం ఎంతవరకు పార్టీ మైనార్టీలలో దూసుకుపోతున్న దానిపై వారు విచారించి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా అర్బన్ మైనార్టీ మోర్చా నాయకులతో మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారి పిలుపుమేరకు భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అన్న దానిపైన పనిచేస్తుందని వారు చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో స్వచ్ఛభారత్ కన్వీనర్ గురు ప్రసాద్ 114 డివిజన్ జనరల్ సెక్రెటరీ ఎం. వరలక్ష్మి మేడ్చల్ జిల్లా అర్బన్ మైనారిటీ ప్రెసిడెంట్ మహమ్మద్ మగ్దూం మైనారిటీ నాయకులు అన్వర్ పాల్గొనడం జరిగింది.బీజేపీ నాయకులు హరీష్‌రెడ్డి తదితరులు పాల్గోన్నారు.