సనత్ నగర్ ప్రజాబలం ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికలు డిసెంబర్ 2023 జరగాల్సిన తరుణంలో అధికార భారాస ముందస్తు ఎన్నికలకు వెళుతుందన్న ఊహాగానాలు జోరుగా షికారు చేస్తున్న వేళ బీజేపీ జాతీయ అధిష్టానం తెలంగాణ లో పార్టీని పటిష్టపరచడానికి గల అన్ని వనరులను, అవకాశాలను వినియోగించుకుని 2023 లో అధికారం సొంత బలంతో ప్రభుత్వం ఏర్పాటు చేసి సుపరిపాలన అందించాలన్న కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో పార్టీని బూత్ స్థాయి నుండి బలోపేతం చేసి క్యాడర్ లో జోష్ నింపేందుకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు 27 వ తేదీన “పాలక్” లను నియమించారు.
రాజేంద్రనగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ మాజీ అధ్యక్షుడు, మాజీ రాష్ట్ర మంత్రివర్యులు మర్రి శశిధర్ రెడ్డి “పాలక్” గా నియమితులు కాగా సనత్ నగర్ శాసనసభ నియోజకవర్గంతో సుదీర్ఘ కాల అవినాభావ సంబంధం గల ఆయనను సనత్ నగర్ బీజేపీ పరివార్ సభ్యులు పార్టీ బేగంపేట్ కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉన్నత విద్యావంతుడు అయిన శశిధర్ రెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం, పౌర సమస్యలపై ఆయనకు గల విషయ పరిజ్ఞానం తదితర అనుకూలాంశాలు పార్టీని మరింతగా ప్రజల వద్దకు తీసుకువేల్లెల దోహదపడతాయని బీజేపీ ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యేచన్ సురేష్ మరియు తాళ్ళ జైహింద్ గౌడ్ లు అభిప్రాయపడ్డారు. ఈ సన్మాన కార్యక్రమంలో బీజేపీ సనత్ నగర్ పరివార్ సభ్యులు ఆకూరి శ్రీనివాస్ రావు, పొలిమేర సంతోష్ కుమార్, హృషికేశవ, నందు, సందీప్ వర్మ, ఆకుల ప్రతాప్, ప్రవీణ్ గౌడ్, మల్లికార్జున్ గౌడ్, సి వి శ్రీనివాస్, మణి, బి వి శ్రీనివాస్, ఇబ్రహీం, రేవంత్, రాజు గౌడ్, అమర్, బంటి, రాజా మిధుల్, ప్రశాంత గౌలికర్, వారణాసి కార్తీక్, పి లక్ష్మణ్, అమరం శ్యాం, సుధాకర్ ముదిరాజ్, లక్ష్మి, సరిత గౌడ్, స్వప్న గుప్తా, తేజో విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారని పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో బీజేపీ సోషల్ మీడియా నాయకుడు పొలిమేర సంతోష్ కుమార్ తెలిపారు.