రాజేంద్ర నగర్ ప్రజాబలం ప్రతినిధి:రాజేంద్ర నగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని మనికొండ మునిసిపల్ కౌన్సిల్ శివపురి నందు రెండు ఎకరాల విస్తీర్ణంలో కల అతి పురాతనమైన పార్వతీ, రామలింగేశ్వర స్వామి దివ్య దేవాలయాల ప్రాంగణములో గత సంవత్సరం పసుపులేటి సుధాకర్ సుగుణమ్మ పుణ్య దంపతులుచే శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయాన్ని కట్టించడం జరిగినది, వారిచే మరియు ఆలయ కమిటీ సభ్యులు ప్రొద్దుట నుండి దేవాలయ వార్షికోత్సవమ్ శాస్త్రోక్తంగా పూజాదికాలు, సాయంత్రం భజనలతో కూడిన అయ్యప్ప పడీ పూజ చేయ సంకల్పించి మరియు మధ్యాహ్నం జరిపిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న మణికొండ బీ ఆర్ ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కే. రామకృష్ణ రెడ్డి, కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు వసంత్ చౌహాన్, రవి కాంత్ రెడ్డి, రాజు గౌడ్, సాయి రెడ్డి, సత్యా రెడ్డి, అందె లక్ష్మణ్ రావు, ప్రభాకర్ రెడ్డి, లక్ష్మయ్య, రాజేంద్ర ప్రసాద్, రాఘవేంద్ర, శ్రావణ్, దిలీప్, భానుచందర్, కిరణ్, జ్యోతి రెడ్డి, గంగాధర్, మధు, శివ గంగ, విజయ లక్ష్మీ ఆదిగా మరియు పురజన భక్తులు పాల్గొని వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిపిన్చిన సుధాకర్ దంపతులకు అంతా మంచే జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు కృతజ్ఞతల ద్వారా తెలియ పరచారు.