ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఫిబ్రవరి 12:
ప్రతి నిరుపేదలకు ఇళ్లు ఉండాలనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు లో భాగంగా అర్హులకు ఇళ్ళను అందించడమే కాకుండా మౌళిక వసతులను కల్పిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ మహేందర్ రెడ్డి అన్నారు.
బుధవారం కీసర మండలంలోని కీసర, చీర్యాల గ్రామాలలో అర్హులైన 71 మంది లబ్దిదారులకు ఇందిరమ్మ ఇళ్ళను పంపిణీ చేసే కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ మాట్లాడుతూ ప్రతి నిరుపేదకు రేషన్ కార్డు, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు అందిస్తామని అన్నారు. పేదలకు ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్ల కాలనీలలో మంచినీటి సదుపాయాలు, మౌలిక వసతులు కల్పిస్తామని తెలిపారు. రైతులందరికీ రెండు లక్షల రుణమాఫీ చేసి, ప్రస్తుతం ఎకరాకు రూ. 6000 చొప్పున రైతు భరోసా అందిస్తున్నామని అన్నారు. రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ, ఎవరు కార్డు రాలేదని బెంగ పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
అంతకు ముందుగా కీసర గుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామిని ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి దర్శించుకున్నారు. అనంతరం కీసర గుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొని ఆలయ కమిటీ చైర్మన్ నారాయణ శర్మ పాలకవర్గ సభ్యులచే ప్రమాణస్వీకారం చేయించినారు.
ఈనెల 26 నుండి ప్రారంభమయ్యే శివరాత్రి బ్రహ్మోత్సవాల కు సుమారు 6 లక్షల మంది భక్తులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు కల్పించాలని సూచించారు. భక్తుల కోసం 350 ఆర్టీసీ బస్సులు, బస్ స్టాప్ నుండి గుట్ట పైకి 8 ఉచిత బస్సుల సౌకర్యం కల్పించాలన్నారు.40 మంది అధికారుల పర్యవేక్షణలో 1800 మంది పోలీసులతో గట్టి బందోబస్తు, పార్కింగ్, మంచినీటి సదుపాయాలు, వైద్య సేవలు, పారిశుద్ధ్యం వంటి ఏర్పాట్లు చేయాలన్నారు.
