మణికొండ ప్రజాబలం ప్రతినిధిహైదరాబాద్ మణికొండలోని మ్యాచ్ పాయింట్ బ్యాడ్మింటన్ అకాడమీలో మ్యాచ్ పాయింట్ టోర్నమెంట్ 2023 సీజన్ 1 ముగిసింది. తెలంగాణలోని వివిధ అకాడమీలకు చెందిన 200 మందికిపైగా క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. మొదటినుంచి చివరి వరకు ఎంతో ఉత్కంఠగా ఈ పోటీలు కొనసాగాయి. విజేతలకు మ్యాచ్ పాయింట్ అకాడమీ ఫౌండర్, చైర్మన్ వేణు ముప్పాల, మణికొండ అల్కాపూర్ టౌన్షిప్ కౌన్సిలర్ శ్రీకాంత్ బహుమతులు అందజేశారు…ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ ఇలాంటి టోర్నమెంట్లు క్రీడాకారులు తమ ఆటను మెరుగు పరుచుకోవడానికి దోహదం చేస్తాయన్నారు. విజేతలకు షటిల్ రాకెట్స్, కిట్ బాగ్స్ తో పాటు ట్రోఫీ లు,మెడల్స్ ,సర్టిఫికెట్లు అందజేశారు..U15 బాయ్స్ సింగిల్స్ విభాగంలో విన్నర్ గా క్రిష్, రన్నర్ గా ప్రణయ్ ,U15 గర్ల్స్ సింగిల్స్ విభాగం లో విన్నర్ గా విజయలక్ష్మి రన్నర్ గా మనస్విని నిలిచారు. U13 బాయ్స్ సింగిల్స్ విభాగం లో విన్నర్ గా హర్ష వర్ధన్, రన్నర్ గా సుహాస్ ,U13 గర్ల్స్ విభాగంలో విన్నర్ గా మనస్విని, రన్నర్ గా లక్ష్య సంహిత నిలిచారు. U11 బాయ్స్ సింగిల్స్ విభాగంలో విన్నర్ గా వివేక్, రన్నర్ గా అభిషేక్,U11 గర్ల్స్ విభాగంలో విన్నర్ గా శ్రీ వైభవి,రన్నర్ గా ఆరాధ్య రెడ్డి నిలిచారు. U7 బాయ్స్ విభాగం లో అన్షు కురాకుల మొదటిస్థానం సాధించాడు. U7 బాలికల విభాగం లో పార్థివి మొదటి స్థానం సాధించింది.U8 బాయ్స్ విభాగం లో రేయాన్ష్ మొదటి స్థానం సాధించాడు.U8 బాలికల విభాగం లో ధాత్రి మొదటి స్థానం సాధించింది.ఈ సందర్భంగా గా వేణు ముప్పాల మాట్లాడుతూ బ్యాడ్మింటన్ క్రీడాకారుల సామర్ధ్యాన్ని పెంచడానికి టోర్నమెంట్స్ ఎంతో ఉపయోగపడతాయన్నారు