హైదరాబాద్ తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇంఛార్జీ మాణిక్ రావ్ థాక్రే తో ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ ముగిసింది. కోమటిరెడ్డి మాట్లాడుతూ నాకిచ్చిన షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడ్డాయి. పీసీసీ కమిటీలను నేను పట్టించుకోనని అయన అన్నారు. నాలుగైదుసార్లు ఓడిపోయినవాళ్లతో నేను కూర్చోవాలా. బుధవారం నియోజకవర్గ పర్యటనల వల్ల థాక్రేను కలవలేకపోయా. సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి ఎందుకు కలవలేదో వాళ్లని అడగండి ముందని అన్నారు. కొన్నిసార్లు నియోజకవర్గ పనులతో కలవకలేము. మా ఫోటోలను మార్ఫింగ్ చేసిన విషయాన్ని ఏఐసీసీనే పట్టించుకోవడంలేదు. నా ఫోటో మార్ఫింగ్ అయిందని స్వయానా సీపీగారే నాకు చెప్పారని గుర్తు చేసారు.