ప్రజాబలం ప్రతినిధి స్టేట్‌బ్యూరో:వికారాబాద్ జిల్లా, దరూర్ మండలం, కుక్కింద గ్రామానికి చెందిన పలువు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈ రోజు చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి.రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, ప్రముఖ సీని నిర్మాత బండ్ల గణేష్ సమక్షంలో బిఆర్‌ఎస్ పార్టీ లో చేరారు. వీరికి ఎంపీ రంజిత్ రెడ్డి కండువా కప్పి బిఆర్‌ఎస్ పార్టీ లోకి సాదరంగా స్వాగతం పలికారు. పార్టీ లో చేరిన వారిలో మాజీ ఎంపీటీసీ నడిమింటి నర్సిములు కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్‌ఎస్ పార్టీలోకి ఆయనతోపాటు 25 మంది సర్పంచుల సంఘం అధ్యక్షులు కారంజి వీరేశం,
పార్టీ అధ్యక్షులు రాజు నాయక్, మాజీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ సంతోష్ కుమార్, మాజీ చైర్మన్ రాములు, మాజీ వైస్ చైర్మన్ రాజు గుప్తా , సర్పంచ్ వెంకటరామిరెడ్డి ,మాజీ సర్పంచ్ కన్న బిచ్చయ్య , కుకిందా పార్టీ అధ్యక్షులు కార్తీక్ చారి ఉప సర్పంచ్ రవి, పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Prev Post
Next Post