ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా సంగారెడ్డి జిల్లా బిజెపి కార్యాలయం వద్ద మహాధర్నా
సంగారెడ్డి ఏప్రిల్ 3 ప్రజ బలం ప్రతినిధి:
ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో
మహాజన నేత మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఈరోజు ఎస్సీ వర్గీకరణపై కేంద్ర ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి కార్యాలయం ముట్టడి లో భాగంగా నేడు సంగారెడ్డి జిల్లా బిజెపి కార్యాలయం ముందు ఎంఎస్పి ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా నిర్మించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహాజన సోషలిస్ట్ పార్టీ సంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ పొట్టోళ్ల వెంకటేష్ మాదిగ ఆధ్వర్యంలో నిర్వహించగా అనంతరం పొట్టోళ్ల వెంకటేష్ మాదిగ మాట్లాడుతూ1994లో ఎమ్మార్పీఎస్ ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం నుండి నేటి వరకు భారతీయ జనతా పార్టీ(బిజెపి ) షెడ్యూలు కులాల వర్గీకరణకు అనుకూలమని చెప్తూ వచ్చింది కానీ పార్లమెంట్లో బిల్లు పెట్టి షెడ్యూల్ కులాల వర్గీకరణకు ఒక్క అడుగు కూడా ముందుకు పంపడం లేదనేది వాస్తవం. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చి తొమ్మిది సంవత్సరాలు కావస్తున్న వర్గీకరణ విషయంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకునే విషయంలో చిత్తశుద్ధి ప్రదర్శించకపోవడం, మాదిగలను ఆవేదనకు గురి చేస్తున్నది. బిజెపి కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతో ఉన్నది ఏ డిమాండ్ లేని ఎలాంటి ఉద్యమాలు లేని అనేక అంశాలు పార్లమెంటులో నెగ్గించుకున్న సందర్భాలు ఈ మధ్యలో చాలా ఉన్నాయి గత 28 సంవత్సరాలు గా పార్టీ విధానంలో భాగంగానే మద్దతు పలికిన ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎందుకు సరైన నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అర్థం కాని అంశంగా మారింది, అయితే కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై గారు షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో సదాశివ కమిషన్ ఆమోదిస్తూ కేబినెట్లో నిర్ణయం తీసుకొని ఢిల్లీకి పంపించడం జరిగింది. ఈ పరిస్థితులలో జాతీయ నాయకత్వాన్ని ఒప్పించి షెడ్యూల్ కులాల వర్గీకరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించే దిశగా మీ వంతు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తూ సంగారెడ్డి జిల్లాలో కార్యాలయంలో ఉన్న ఇన్చార్జి నరేందర్ రెడ్డి కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో.అబ్రహం మాదిగ ఎమ్మెస్పి సంగారెడ్డి జిల్లా కో కన్వీనర్, ఎమ్మెస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బైరపోగు శివ మాదిగ, మైస గల బుచ్చంద్ర మాదిగ ఎమ్మార్పీఎస్ సంగారెడ్డి జిల్లా కన్వీనర్, పెద్ద గీత మాదిగ ఎంఎంఎస్ ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్, జయరాజ్ మాదిగ ఎమ్మెస్పి జహీరాబాద్ నాయకులు, ఎమ్మార్పీఎస్ అందోల్ నియోజకవర్గం నాయకులు రాజీవ్ మీరు దొడ్డి, అలిగే రాజు రైకోడ్ మండల కన్వీనర్, గంగేరి అనిల్ మాదిగ ఎమ్మార్పీఎస్ టౌన్ కన్వీనర్, పోతరాజు శివకుమార్ మాదిగ ఎమ్మార్పీఎస్ టౌన్ సంగారెడ్డి జిల్లా కో- కన్వీనర్, ఉష నగల లక్ష్మణ్ మాదిగ ఎమ్మార్పీఎస్ A లక్ష్మి, A. సంధ్య తదితరులు పాల్గొన్నారు.