సంగారెడ్డి,ఏప్రిల్ 03 ప్రజ బలం ప్రతినిధి
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరవీరుడు దొడ్డి కొమరయ్య అని,అందరూ వారి స్ఫూర్తిని కొనసాగించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు.
దొడ్డి కొమరయ్య జయంతినిని పురస్కరించుకుని కలెక్టర్ సోమవారం కలెక్టరేట్ పక్కన గల (సండే మార్కెట్లో ) దొడ్డి కొమురయ్య విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోకలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన దొడ్డి కొమరయ్య 96వ జయంతోస్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి దొడ్డి కొమరయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్బంగా ఆర్.డి. ఓ.నగేష్ మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతినీ ప్రభుత్వం అధికారికంగా జరపడం సంతోషకరమన్నారు.
కార్పో రేటర్ పుష్ప నగేష్ మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత మహనీయులను, పోరాట యోదులను స్మరించుకునే విధంగా జయంతి, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించుకోవడం జరుగుతుందన్నారు.
దొడ్డి కొమురయ్య జయంతిని అధికారికంగా జరుపడానికి జీ ఓ జారీ చేసిన సి ఎంకు,మంత్రి హరీష్ రావు కు కృతజ్ఞతలు తెలిపారు.
బీరయ్య యాదవ్ మాట్లాడుతూ దొడ్డి కొమురయ్య ఆశయాలు,ఆదర్శాలకు అనుగుణంగా,వారి స్ఫూర్తితో యువత ముందుకు వెళ్లాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య జయంతులను అధికారికంగా నిర్వహి స్తున్నందుకు సిఎం కు
కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా బిసి సంక్షేమ శాఖ అధికారి జగదీష్, కురుమ సంఘం నాయకులు,వివిధ కుల సంఘాల నాయకులు, మహిళలు ,అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు, తదితరులు పాల్గోన్నారు.