భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి ఏప్రిల్ 03 (ప్రజాబలం) కొత్తగూడెం తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడైన శ్రీ దొడ్డి కొమురయ్య జయంతిని పురస్కరించుకొని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయము నందు శ్రీ దొడ్డి కొమురయ్య జయంతి కార్యక్రమమును నిర్వహించడము జరిగినది. అట్టి కార్యక్రమము నందు శ్రీమతి యం. విద్యాలత, ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీమతి బి. నాగలక్ష్మి ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీ దొడ్డి కొమురయ్య చిత్ర పటానికి పూలమాల వేసినారు.
శ్రీమతి యం. విద్యాలత మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమవడానికి భూమికోసం భుక్తికోసం విముక్తి ఉద్యమంగా పోరాటం మారడానికి దొడ్డి కొమరయ్య అమరత్వమే ప్రధాన కారణం. తెలంగాణ సాయుధ పోరాటం చరిత్ర అని తలుచుకోగానే మొదటగా స్ఫురణకు వచ్చే వ్యక్తి దొడ్డి కొమరయ్య ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కడివెండి గ్రామంలో ఒక సాధారణ కురుమ కులానికి చెందిన గొర్రెల కాపరుల కుటుంబములో జన్మించిన కొమరయ్య ఒక మహోన్నత ఉద్యమానికి ఆద్యుడవడం తెలంగాణ ప్రజలకు గర్వకారణం అని అన్నారు.
ఇట్టి కార్యక్రమములో ఇతర ప్రజా ప్రతినిధులు మరియు కార్యాలయపు సిబ్బంది హాజరు
అయినారు.