ఆరోగ్య మహిళా కేంద్రాల్లో పెద్ద ఎత్తున వైద్య పరీక్షలు నిర్వహించు విధంగా చర్యలు జిల్లా కలెక్టర్ అనుదీప్

 

భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి ఏప్రిల్ 03 (ప్రజాబలం) కొత్తగూడెం సోమవారం ఐడిఓసి కార్యాయలపు సమావేశపు హాలులో ఆరోగ్య మహిళా కేంద్రాల్లో వైద్య పరీక్షలు నిర్వహణ, పెండింగ్ సోషల్ ఆడిట్ పేరాలు, 2వ విడత గొర్రెల పంపిణీ, పంటనష్టం గణన, దళితబంధు యూనిట్లు నిర్వహణ, మన ఇసుక వాహనం తదితర అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య మహిళా కేంద్రాల్లో మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహణకు మహిళా స్వయం సహాయక సంఘాల మహిళలను పెద్దఎత్తున మొబలైజ్ చేయాలని చెప్పారు. జిల్లాలోలని ఐదు నియోజకవర్గాల పరిధిలో ఎర్రగుంట, పర్ణశాల, పెనగడప, యంపి బంజర, కొమరారం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య మహిళా కేంద్రాల పరిధిలోని మహిళలు ఆరోగ్య పరీక్షలు నిర్వహణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పారు. మహిళలు పెద్దఎత్తున ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకునే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు పరీక్షలు పెంచాలని చెప్పారు. ఉపాధిహామి పథకంలో పెండింగ్ ఉన్న ఆడిట్ పేరాలు పరిష్కారానికి చర్యలు చేపట్టాలని డిఆర్డిఓకు సూచించారు. 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాలనికి చర్యలు చేపట్టాలని పశుసంవర్ధక అధికారులను ఆదేశించారు. ఎంతో ప్రతిష్టాత్మక కార్యక్రమని పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమించనున్నట్లు చెప్పారు. నాణ్యమైన యూనిట్లు ఎంపిక చేయుటకు కమిటి ఏర్పాటుకు ప్రతిపాదనలు అందచేయాలని చెప్పారు. ఆరోగ్యవంతమైన యూనిట్లు కొనుగోలు చేయాలని చెప్పారు. జిల్లాలో 11060 మంది గొర్రెల యూనిట్లు పంపిణీకి నమోదు కాగా, మొదటి విడతలో 7511 మందికి యూనిట్లు పంపిణీ చేశామని, 2వ విడత 3549 పంపిణీకి చర్యలు చేపట్టాలని చెప్పారు. యూనిట్లు పంపిణీకి ఎంపికైన లబ్దిదారులు వాటాగా 25 శాతం చెల్లించాలని, మిగిలిన 75 శాతం ప్రభుత్వం సబ్సిడి మంజూరు చేస్తుందని చెప్పారు. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు పరిహారం అందించేందుకు జరుగుతున్న గణన ప్రక్రియను పర్యవేక్షణ చేయాలని వ్యవసాయ, ఉద్యాన అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు గణన ప్రక్రియ జరుగుతుందో లేదో నిశిత పరిశీలన చేయాలని చెప్పారు. గణన ప్రక్రియలో రైతులను ఇబ్బందొ పెట్టొద్దని, అర్హులకు పరిహారం అందించాలని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు 33 శాతం నష్టం వాటిల్లిన వారికి పరిహారం అందించు విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. దళితబంధు యూనిట్లు నిర్వహణను నిరంతర పర్యవేక్షణ చేయాలని మున్సిపల్ కమిషనర్లు, యంపిడిఓలను, యంపిఓలకు సూచించారు. యూనిట్లు ఏర్పాటును యాప్లో అప్లోడ్ చేయాలని చెప్పారు. నిర్వహణలో లోపాలుంటే తన దృష్టికి తేవాలని చెప్పారు. మన ఇసుక వాహనం నిర్వహణకు ప్రతిపాదనలు తయారు చేయాలని చెప్పారు. ధరణి దరఖాస్తులు పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking