ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి ,
మేడ్చల్ ప్రజాబలం ప్రతినిధి ఏప్రిల్ 3: సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 97 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్ తో పాటు జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యానాయక్, లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అనంతరము అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి వచ్చినా అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking