బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కారుకూరి సురేందర్ కి సన్మానం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఎప్రిల్ 03 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట బార్ అసోసియేషన్ ఎన్నికల్లో అధ్యక్షునిగా ఎన్నికైన ప్రముఖ న్యాయవాది కారుకూరి సురేందర్ ను మిత్ర బృందం సోమవారం ఐబీ లో పూలమాల,శాలువాలతో ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ…తమ మిత్రుడు ఇప్పటికీ రెండు సార్లు బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఎన్నికవడం గర్వకారణమన్నారు. ఉన్నత విద్యను అభ్యసించి, న్యాయవాదిగా ప్రజలకు సురేందర్ అందిస్తున్న సేవలు మరువలేనివన్నారు.అనంతరం భారత రాజ్యాంగంలోని న్యాయశాఖ గొప్పతనంను అందరూ గుర్తించాలని,చట్టాలపై ప్రజలు అవగాహనా పెంచుకోవాలని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కారుకూరి సురేందర్ పిలుపునిచ్చారు.చిన్ననాటి మిత్రులు తనకు సన్మానం చేయడం ఆనందంగా ఉందన్నారు.అనంతరం స్వీట్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో సురేందర్ బాల్య మిత్రులు ఈ కార్యక్రమంలో కర్రే మోగిలి,రచేళ్ళ సునిల్,కారుకూరి సత్తయ్య,పెద్ద మల్లేష్,చిన్న మల్లేష్, కిషన్,మోటపలుకుల కమలాకర్, బత్తుల వేంకటేష్,ముద్దసాని శ్రావణ్,రాయుడు,బుద్దె రాజు కూమార్,మిత్ర బృందం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking