ఏ హడావుడి లేని తెలంగాణా బడ్జెట్‌

తెలంగాణ బడ్జెట్‌ రూ.2,90,396 కోట్లు
రెవెన్యూ వ్యయం రూ.2,11,685 కోట్లు
మూలధన వ్యయం రూ.35,525 కోట్లు
బడ్జెట్‌లో ఊసేలేని ఎన్నికల హావిూల పథకాలు
బడ్జెట్‌లో ఊసేలేని నిరుద్యోగ భృతి హావిూ..
హైదరాబాద్‌ ఫిబ్రవరి 6 అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమైనాయి. తెలంగాణ శాసన మండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డిని తన ఛాంబర్‌ లో మర్యాదపూర్వకంగా కలిసి నేడు ప్రవేశపెట్టినున్న బడ్జెట్‌ ప్రతులను హరీష్‌ రావు, వేముల ప్రశాంత్‌ రెడ్డి అందజేశారు.తెలంగాణ శాసన సభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డిని తన ఛాంబర్‌ లో మర్యాదపూర్వకంగా కలిసి నేడు ప్రవేశపెట్టినున్న బడ్జెట్‌ ప్రతులను ఆర్ధికశాఖ మంత్రి హరీష్‌ రావు అందజేశారు. వేముల ప్రశాంత్‌ రెడ్డి, స్పెషల్‌ సీఎస్‌ రామకృష్ణ రావు తదితరులు పోచారంను కలిసిన వారిలో ఉన్నారు.బడ్జెట్‌ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉంటుందని.. బడ్జెట్‌లో అభివృద్ధి, సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఉంటుందని హరీష్‌ రావు తెలిపారు. కేంద్రం సహకరించక పోయినా.. ప్రజల ఆకాంక్షలు నెరవేరేలా బడ్జెట్‌ను రూపొందించామన్నారు. తెలంగాణ బడ్జెట్‌ దేశానికి మోడల్‌గా నిలుస్తుందని మంత్రి హరీష్‌రావు పేర్కొన్నారు.

అనంతరం
అసెంబ్లీలో ఆర్దిక శాఖ మంత్రి హరీష్‌ బడ్జెట్‌?ను ప్రవేశపెట్టారు.
బడ్జెట్‌?లో..దళిత బంధుకు భారీగా నిధులు కేటాయించారు.
పేదలకు సొంత స్థలంలో ఇళ్ల నిర్మాణం కోసం రూ.3లక్షల సాయం
ప్రతి నియోజకవర్గంలో 1,100 మందికి దళితబంధు
కొత్తగా మరో 100 బస్తీ దవాఖానాలు ఏర్పాటు
ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలకు అనుబంధంగా నర్సింగ్‌ కాలేజీలు
బడ్జెట్‌లో ఊసేలేని నిరుద్యోగుల భృతి హావిూ
ఉద్యోగ, ఉపాధ్యాయులకు కొత్త ఈహెచ్‌ఎస్‌ విధానం
ప్రతి నియోజకవర్గంలో 1,100 మందికి దళితబంధు
ఈ ఏడాది 60 జూనియర్‌, సీనియర్‌, జిల్లా జడ్జిల కోర్టులు ఏర్పాటు
ఏప్రిల్‌ నుంచి కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ
ఏప్రిల్‌ నుంచి సెర్ప్‌ ఉద్యోగులకు పే స్కేలు సవరణ
మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనం రూ.3వేలకు పెంపు
ప్రభుత్వ ప్రకటనలకు రూ.వెయ్యి కోట్లు
మెట్రో రైల్‌ ప్రాజెక్ట్‌ కోసం రూ.1,500 కోట్లు
ఎయిర్‌పోర్టు మెట్రో కనెక్టివిటీ కోసం రూ.500 కోట్లు
ఓల్డ్‌ సిటీ మెట్రో కనెక్టివిటీ కోసం రూ.500 కోట్లు
యాదాద్రి ఆలయ అభివృద్ధికి రూ.500 కోట్లు
మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధికి రూ.200 కోట్లు
మహిళా వర్సిటీకి రూ.100 కోట్లు
విద్యా రంగానికి రూ.19,093 కోట్లు
కేసీఆర్‌ న్యూట్రిషన్‌ కిట్‌కు రూ.200 కోట్లు
పల్లె, పట్టణ ప్రగతికి రూ.4,834 కోట్లు
డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు రూ.12వేల కోట్లు
ఆరోగ్యశ్రీకి రూ.14,063 కోట్లు
పంచాయతీ రాజ్‌కు రూ.31,426 కోట్లు
రుణమాఫీకి రూ.6,385 కోట్లు
షెడ్యూల్‌ కులాల ప్రత్యేక ప్రగతి నిధికి రూ,.36,750 కోట్లు
మహిళా శిశు సంక్షేమ శాఖకు రూ.2,131 కోట్లు
గ్రావిూణ రోడ్లకు రూ.2 వేల కోట్లు
హరితహారం పథకానికి రూ.1,471 కోట్లు
పురపాలక శాఖకు రూ.11,372 కోట్లు
రోడ్లు, భవనాల శాఖకు రూ.2,500 కోట్లు
పరిశ్రమల శాఖకు రూ.4,037 కోట్లు
హోంశాఖకు రూ.9,599 కోట్లు
మైనార్టీ సంక్షేమానికి రూ.2,200 కోట్లు
రైతు బీమా పథకానికి రూ.1,589 కోట్లు
రైతు బంధు పథకానికి రూ.1,575 కోట్లు
వైద్యారోగ్య శాఖకు రూ.12,161 కోట్లు
వ్యవసాయ శాఖకు రూ.26,831
గిరిజన సంక్షేమం, ప్రభుత్వ ప్రత్యేక ప్రగతి నిధికి రూ.15,223 కోట్లు
నీటి పారుదల రంగానికి రూ.26,885 కోట్లు
కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకాలకు రూ.3,210 కోట్లు
ప్రజాపంపిణీ వ్యవస్థకు రూ.3,117 కోట్లు
విద్యుత్‌ రంగానికి రూ.12,727 కోట్లు
ఆయిల్‌ ఫామ్‌కు రూ.వెయ్యి కోట్లు
దళిత బంధుకు రూ.17,700 కోట్లు
ఆసరా పెన్షన్లకు రూ.12 వేల కోట్లు
బీసీ సంక్షేమానికి రూ.6,229 కోట్లు

Leave A Reply

Your email address will not be published.

Breaking