శ్రీ గురుపాదుకా పీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.

ఖమ్మం ప్రతినిధి ఫిబ్రవరి 05 (ప్రజాబలం) ఖమ్మం నగరంలోని కస్పాబజార్ శ్రీగురుపాదుకా పీఠం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఆదిత్య చెవి ముక్కు గొంతు వైద్యశాల సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ వైద్య శిబిరంలో డాక్టర్ ఎస్ వి వి వి ఆదిత్య కుమార్ 52 మందికి చెవి , ముక్కు , గొంతు థైరాయిడ్ వైద్యపరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు . ఈ కార్యక్రమంలో గురుపాదుకా పీఠం ట్రస్ట్ చైర్మన్ ఉరిమెళ్ల కృష్ణ ప్రసాద్ , డాక్టర్ నందనందన్ , డాక్టర్ అశోక్ డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార , సుడా డైరెక్టర్ షేక్ ముక్తార్ ట్రస్టీలు ఉరిమెళ్ళ లక్ష్మి ,వినోదమ్మ, సింధుజ , శ్రీజ మరియు ట్రస్ట్ సభ్యులు జయంతి సుగుణమ్మ సోమ నాగేశ్వరమ్మ ,సోమ నాగరాజు, కొమ్మోజు భారతి కొత్తపల్లి ధనమ్మ లక్ష్మీదేవి ఉమాదేవి సుగ్గల రాజారావు పొట్టి మూర్తి జనార్ధన్ అంగన్వాడీ టీచర్ ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు . అనంతరం పేదవారికి ఆహార పొట్లాలను పంపిణీ చేశారు

Leave A Reply

Your email address will not be published.

Breaking