ప్రజాబలం ప్రతినిధి:హైదరాబాద్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అంధత్వం లేని సమాజమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని ఆయన తెలిపారు. హైదరాబాద్ ఇసా మియా బజార్ లోని విక్టోరి యా ప్లే గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు శిభిరాన్ని ఆయన పర్యవేక్షించారు.

హైదరాబాద్ నగర వ్యాప్తంగా గత మూడు రోజులుగా ఆరు లక్షలకు పైగా స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించామని… 1 లక్ష 53 వేల మందికి రీడిరగ్ గ్లాసులను అందజేశామన్నారు. మరో లక్ష 14 వేల మందికి ఒక నెల రోజులలో గ్లాసెస్ ను అందజేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 3 లక్షల 52 వేల మందికి కంటి సమస్యలు లేనట్లు తేలిందన్నారు. 100 రోజుల పాటు కొనసాగే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని తలసాని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బీఆర్‌ఎస్ గోషామహల్ ఇంఛార్జ్ ప్రేమ్‌సింగ్‌రాథోడ్,మాజీ కార్పోరేటర్ రామచంద్రరాజు,నగర గ్రంథాలయ మాజీ ఛైర్మెన్‌గడ్డం శ్రీనివాస్‌యాదవ్,నందకిషోర్‌వ్యాస్,దిలిప్‌గానాఠే,ఎస్.ధన్‌రాజ్ తదితరులు పాల్గోన్నారు.