ఉపాధ్యాయులను హింసించడం తగదు
డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముందు బిజెపి నేతల ధర్నా
ప్రజాబలం ప్రతినిధి: హైదరాబాద్, రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 317 ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపు మేరకు మైనార్టీ మోర్చా ఆధ్వర్యంలో డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కార్యాలయాన్ని ముట్టడిరచారు.

ఈ సందర్భంగా బిజెపి మైనార్టీ మోర్చా అధ్యక్షుడు అప్సర్ పాషా మాట్లాడుతూ… టిఆర్‌ఎస్ ప్రభుత్వం ఉపాధ్యాయులను తీవ్రంగా వేధిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జీవో 317 పేరిట భార్యాభర్తలైన ఉపాధ్యాయులను వేరువేరు జిల్లాలకు బదిలీలు చేసి వేధింపులకు గురి చేయడం తగదన్నారు. బిజెపి మైనార్టీ మోర్చా స్వచ్ఛభారత్ కన్వీనర్ అమీనా మాట్లాడుతూ తక్షణమే స్పోస్ కేసులను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
80 వేల పుస్తకాలను చదివానని చెప్పుకుని అపర మేధావి అయిన ముఖ్యమంత్రి కెసిఆర్, ఎందుకని ఉపాధ్యాయులను వేధిస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ మోర్చా నాయకులు ముజీబ్, గజినీ బాయ్, జుబేర్ , యాకూబ్ , బిజెపి నాయకులు సైదులు, మగ్గ్ దూమ్‌తదితరులు పాల్గొన్నారు.