ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 06 : కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యమని పట్టణ అధ్యక్షుడు ఎం డి ఆరీఫ్ అన్నారు.సోమవారం స్థానిక పాత బస్టాండ్ వద్ద ఇంద్రవెల్లి జనగర్జన క్యాలెండర్ ఆవిష్కరించారు.రేవంత్ రెడ్డి ఆదేశాలతో మున్సిపాలిటీలో
5,12 వార్డు లో హత్ సే హాత్ జొడో యాత్రకు మద్దతుగా కోక్కిరాల సురేఖ- ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో గడప గడప కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి వెళ్ళి అభివృద్ధి పథకాలను వివరించడం జరిగింది. ఈ సందర్భంగా పట్టణాధ్యక్షుడు యండి ఆరిఫ్ మాట్లాడుతూ…. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అన్యాయాలు,అక్రమాలను ప్రజలకు వివరించడం కోసమే ఈ హత్ సే హాత్ జొడోయాత్ర అని అన్నారు. మున్సిపాలిటీలోని 5,12 వార్డులో ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని వాటిని పట్టించుకునే నాధుడే కరువైయ్యరని మండిపడ్డారు.రానున్న రోజుల్లో కేంద్రంలో,ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడానికి ప్రజలందరూ కాంగ్రెస్ వైపు నడవాలని అన్నారు.కెసిఆర్ రైతులను ఉచిత కరెంటు పేరుతో రైతులను నిండా దోపిడీ చేస్తున్నారని అన్నారు.కాంగ్రెస్ హయాంలో ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేసి దేశాభివృద్ధికి పాటుపడిందని అన్నారు. కాంగ్రెస్ చేసిన సేవలను ప్రతి ఒక్కరు గుర్తించాలని పిలుపునిచ్చారు.అన్ని వర్గాలకు కాంగ్రెస్ పార్టీ తోనే న్యాయం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పింగిలి రమేష్,కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం, ఎంపీపీ అన్నం మంగ చిన్నన్న, వైస్ ఎంపిపి దేవెంధర్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు నలిమేల రాజు,కాంగ్రెస్ నాయకులు,పాయల చిన్నయ్య,అంకతి శ్రీనివాస్,రమేష్, బూత్ ఇన్చార్జి వివిధ గ్రామ కమిటీ అధ్యక్షులు,సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.