ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 06 : లక్షెట్టిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని డా. బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్టడీసెంటర్ ఆద్వర్యంలో నలభై వసంతాల వేడుక నిర్వహించారు.డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్థాపించి నలభై సంవత్సరాలు పూర్తిఅయిన సందర్భంగా ఈ వేడుకలు నిర్వహించడం జరిగిందని కో ఆర్డినేటర్ కుమారస్వామి తెలిపారు. ప్రిన్సిపాల్ డా. జైకిషన్ ఓజా కేక్ కట్ చేసి అభ్యాసకులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా మాట్లాడతూ… అంబేద్కర్ ఓపెన్ యునివర్సిటీ త్వరలోనే న్యాక్ అక్రిడేషన్ కోసం వెలుతున్నందున అభ్యాసకులు నాక్ గుర్తిoపు కోసం తోడ్పడాలని తెలిపారు.అనివార్య కారణాల వలన చదువు మధ్యలో ఆపివేసిన వారికి అంబేద్కర్ ఓపెన్ యునివర్సిటీ ఒక వర ప్రదాయిని అని, ఈ సంస్థద్వార ఎందరో డ్రాప్ అవుట్లు మళ్ళీ విద్యను కొనసాగించి ఉన్నత స్థానాలలో స్థిరపడ్డారని తెలిపారు.లక్షెట్టిపేట ప్రాంతంలో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈ సంవత్సరం నుండే తన సేవలను ప్రారంభించిది కాబట్టి వాటిని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాబోయే శనివారం నుండి పరీక్షలు ఉన్నందున విద్యార్థులు వాటికోసం సన్నద్ధం కావాలని సూచించారు కార్యక్రమంలో స్టడీ సెంటర్ కో ఆర్డినేటర్ కుమారస్వామి, అధ్యాపక కౌన్సిలర్లు డా.సురేష్, శ్రీనివాస్,సంద్యారాణి కవిత, బోధనేతర సిబ్బంది సునీల్, సునిత,అంబేద్కర్ స్థడీసెంటర్ అభ్యాసకులు పాల్గొన్నారు.