మద్దిశెట్టి సామేలు పై తప్పుడు కేసులు పెట్టాలని, తప్పుడు ప్రచారాలు చేస్తున్న వ్యక్తుల పై జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.
భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి ఫిబ్రవరి 06 (ప్రజాబలం) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండల కేంద్రంలో ఈరోజు 500 మంది కార్యకర్తలతో బి ఎస్ ఎస్ ఎం తెలంగాణ రాష్ట్ర చైర్మన్ మరియు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మద్దిశెట్టి సామేలు పై కొంతమంది వ్యక్తులు తప్పుడు కేసులు పెడుతూ, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, న్యూస్ పేపర్ లో రాస్తున్నారని ర్యాలీ చేయడం జరిగింది. అనంతరం జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది
అదే విధంగా ఎవరైనా మద్దిశెట్టి సామేలు పై తప్పుడు కేసులు పెట్టిన, పెట్టాలని ఎటువంటి ఆధారాలు లేకుండా న్యూస్ పేపర్ లో రాసిన 30 మండలాల్లో ఉన్న లక్షా యాభై వేల మంది కార్యకర్తలు చూస్తూ ఊరుకోమని, ఇంటికి వచ్చి లాక్కొని వెళ్లి పోలీస్ స్టేషన్ లో అప్పచెప్తామని హెచ్చరిస్తున్నాము